ETV Bharat / international

ప్రభుత్వ ఏర్పాటులో నెతన్యాహూ మళ్లీ విఫలం - బెంజమిన్​ నెతాన్యాహు

ఇజ్రాయెల్​ దేశాధ్యక్షుడు విధించిన గడువులోగా.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్లీ విఫలమయ్యారు. దీంతో.. ప్రతిపక్ష నేత యయిర్ లపిడను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

Netanyahu
ప్రభుత్వ ఏర్పాటులో నెతన్యాహూ మళ్లీ విఫలం
author img

By

Published : May 6, 2021, 5:41 AM IST

ఇజ్రాయెల్​లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడటం లేదు. దేశాధ్యక్షుడు విధించిన గడువులోగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంటులో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు అవసరం.

చర్చలు విఫలం..

మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 30 సీట్లు గెల్చుకొని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను నెతన్యాహుకు దేశాధ్యక్షుడు రూవెన్ రిఫ్లిన్ మంగళవారం వరకు గడువిచ్చారు. ఇతర పార్టీల నేతలతో జరిపిన చర్చలు విఫలమవడం వల్ల తాజాగా నెతన్యాహు చేతులెత్తేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడి వద్ద అశక్తత వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత యయిర్ లపిడను రిఫ్లిన్ ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు నాలుగు వారాల గడువిచ్చారు.

లపిడకు చెందిన యెష్ అటిడ్ పార్టీ ఎన్నికల్లో 11 సీట్లు దక్కించుకుంది. అయితే- ఇప్పటికే 56 మంది ఎంపీల మద్దతును ఆయన కూడగట్టినట్లు తెలుస్తోంది. లపిడ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దేశంలో గత రెండేళ్లలో నాలుగుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి గమనార్హం.

ఇదీ చూడండి: మెజారిటీ కోల్పోయిన ఓలీ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.