ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్ పేరుతో ఇజ్రాయెల్​లో ఓ గ్రామం - us israel news

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మీద గోలన్ హైట్స్‌లో కొత్త గ్రామాన్ని నిర్మించే ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించినట్లు ఇజ్రాయెల్ కేబినెట్ మంత్రి తెలిపారు. గోలన్​ హైట్స్​ను ఇజ్రాయెల్​ అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తూ 2019లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేశారు ట్రంప్. అందుకు కృతజ్ఞతగా ఆయన పేరుతో గ్రామాన్ని నిర్మిస్తున్నారు.

Israel OKs plan for new Golan settlement named after Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మీద ఇజ్రాయెల్​లో గ్రామం
author img

By

Published : Jun 15, 2020, 1:23 PM IST

ఇజ్రాయెల్​ ఆక్రమిత గోలన్ హైట్స్​లో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పేరుతో గ్రామాన్ని నిర్మించనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను అమోదించినట్లు ఇజ్రాయెల్ కేబినెట్ మంత్రి హోటోవెలీ ఆదివారం వెల్లడించారు. రామత్​ ట్రంప్​ పేరుతో నిర్మించబోయే ఈ గ్రామంలో.. 300 కుటుంబాలకు ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

1967 మిడిల్​ ఈస్ట్​ యుద్ధంలో సిరియా నుండి గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. దానిని 1981లో స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ సమాజం ఈ చర్యను తప్పుపట్టింది. ఆ భూభాగంలో ఇజ్రాయెల్ స్థావరాలు నిర్మించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమని విమర్శించింది.

ట్రంప్​ అండ..

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇజ్రాయెల్​కు మద్దతుగా నిలిచారు. వ్యూహాత్మక పర్వత పీఠభూమిని ఇజ్రాయెల్​ భూభాగంగా గుర్తిస్తూ 2019లో ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​పై సంతకం చేశారు. ఇజ్రాయెల్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ పరిణామాలు జరిగాయి. ఇజ్రాయెల్​కు ప్రయోజనం చేకూర్చే అనేక దౌత్యపరమైన చర్యలలో ఈ నిర్ణయం కూడా ఒకటని ప్రభుత్వం నుంచి విస్తృత ప్రశంసలు వచ్చాయి.

ట్రంప్​ పేరుతో నిర్మించబోయే రామత్​ ట్రంప్​ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 2.3 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది ఇజ్రాయెల్​ ప్రభుత్వం. నెతన్యాహు గత సంవత్సరం ప్రకటించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయనుంది.

గోలన్ హైట్స్‌పై ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని అమెరికా అధ్యక్షుడు గుర్తించినందుకు ఓ ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని గతేడాది జూన్​లో కేబినేట్​ సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్​ నిర్వహించారు నెతన్యాహు. రామత్ ట్రంప్​ ఏర్పాటు కోసం ఆచరణాత్మక చర్యలు ప్రారంభిస్తామని ఆదివారం జరిగిన కేబినెేట్​ సమావేశంలో వెల్లడించారు.

గోలన్ హైట్స్​లో గత కొద్ది సంవత్సరాలలో పదుల సంఖ్యలో నివాసాలను నిర్మించింది ఇజ్రాయెల్. 2019 నాటికి అక్కడ 26,000 మంది వలస యూదులు నివసిస్తున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.