ETV Bharat / international

తాలిబన్లు మంచిగా మారిపోయారా? ఆ ప్రకటనల ఆంతర్యమేంటి? - తాలిబన్ క్రూరపాలన

కరుడుగట్టిన మత ఛాందసవాదం... క్రూర పాలన... భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపడం... అఫ్గాన్​లో తాలిబన్ల శకం గురించి మాట్లాడుకుంటే ముందుగా వినిపించే మాటలివి. కానీ ఇదంతా గతం! ఇప్పుడు తాలిబన్లు మారిపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరు నిజంగానే మారిపోయారా? అసలేంటి కథ?

Is Taliban trying to shed its misogynistic image?
తాలిబన్లలో పరివర్తన- మంచిగా మారిపోతున్నారా?
author img

By

Published : Aug 17, 2021, 4:13 PM IST

తాలిబన్లు మారిపోయారా? మహిళా వ్యతిరేకులనే ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే పాక్షికంగా అవునేమోనన్న సమాధానం వస్తోంది. అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తర్వాత వీరిలో కాస్త మార్పు కనిపిస్తోంది. ఇదివరకు తమకు ఉన్న ఇమేజ్​ను తుడిచేసుకొని, ప్రజల్లో భయాలను తొలగించుకోవాలని యత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

దేశ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటన చేసిన తాలిబన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు ఎనాముల్లా సమంగానీ.. అదే సమయంలో మహిళల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సహజ వైఖరికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటులో మహిళలు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు. 'ఇస్లామిక్ ఎమిరేట్(అఫ్గానిస్థాన్).. మహిళలను బాధితులుగా చూడాలనుకోవడం లేదు. ఏ విధమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే అంశంపై స్పష్టత లేదు. గత అనుభవాలను బట్టి.. పూర్తిస్థాయి ఇస్లామిక్ నాయకత్వమే ఉండాలని అనుకుంటున్నాం. అన్ని వర్గాలు ఇందులో భాగస్వాములు కావాలి' అంటూ చెప్పుకొచ్చారు.

అఫ్గాన్‌ను ఆక్రమించుకునే సమయంలోనూ తాలిబన్లు తమ సహజ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఎక్కడా విధ్వంసాలకు పాల్పడలేదు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి మంగళవారం భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

మరోవైపు, అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ హామీ ఇచ్చారు. అఫ్గాన్‌ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అదే సమయంలో, ఓ మహిళా జర్నలిస్ట్​కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళలు పని చేయడాన్ని ఇష్టపడని తాలిబన్లు.. ఇలా ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని కొత్తగా చూస్తున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు.

Is Taliban trying to shed its misogynistic image?
టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్న తాలిబన్ ప్రతినిధి

అప్పట్లో అలా..

1996 నుంచి 2001 మధ్య తాలిబన్లు అఫ్గాన్​ను పాలించినప్పుడు.. వారి అకృత్యాలు, మహిళలపై విద్వేషం అంతర్జాతీయ సమాజం దృష్టికి వచ్చింది. మహిళలు పనిచేసుకునే అవకాశం కల్పించేవారు కాదు, బయటకు వెళ్తే తప్పకుండా బుర్ఖా ధరించాల్సి వచ్చేది. ఎనిమిదేళ్లు దాటిన బాలికలు చదువుకునేందుకు ఆస్కారం ఉండేది కాదు. ఈ వయసు దాటిన వారు ఖురాన్ చదివేందుకు మాత్రమే అనుమతి ఉండేది.

మహిళలు వాహనాలు నడపడం, తోడు లేకుండా ట్యాక్సీలలో ప్రయాణించడంపై నిషేధం ఉండేది. ఆస్పత్రులలో మహిళా డాక్టర్లతోనే వైద్యం చేయించుకోవాల్సి వచ్చేది. దీంతో అఫ్గాన్ మహిళలు ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు. అందుకే తాలిబన్లు అఫ్గాన్​ను ఆక్రమించుకోగానే.. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తాయి. పౌరుల్లో భయాందోళనలు తలెత్తి.. దేశం నుంచి పారిపోయేందుకు యత్నించారు.

ఇప్పుడే నమ్మలేం!

సమాంగానీ ఎంత సున్నితంగా మాట్లాడినా.. మహిళా యాంకర్లతో అఫ్గాన్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేయించుకున్నా.. దేశంలోని మహిళల్లో భరోసా నింపాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న మాట వాస్తవం. అఫ్గాన్​లో ఈ ఆటవిక పాలనను ప్రత్యక్షంగా అనుభవించిన వారైతే.. తాలిబన్ల మాటలను ఇప్పుడే నమ్మేందుకు సిద్ధంగా లేరు. ప్రస్తుతం దిల్లీలో నివాసం ఉంటున్న అఫ్గాన్ పౌరుడు అదిబా.. ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఐరాసతో పాటు పలు దేశాలను నమ్మించేందుకు ఇలాంటి మాటలు చెబుతున్నారని, క్రమంగా తమ నిజస్వరూపాన్ని బయటపెడతారని హెచ్చరిస్తున్నారు.

(రచయిత- అరూనిం భుయాన్)

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.