ETV Bharat / international

Iraq News: ఇరాక్​లో ఉగ్రదాడి- 11 మంది మృతి

ఇరాక్​లో (Iraq News) ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్​కు సమీపంలోని ఉండే ఓ గ్రామంపై దాడి చేసిన వీరు 11 మందిని బలిగొన్నారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

11 killed in IS attack
ఇరాక్​లో ఉగ్రదాడి
author img

By

Published : Oct 27, 2021, 11:12 AM IST

ఇరాక్​లోని (Iraq News) బాగ్దాద్‌కు ఈశాన్యం వైపున ఉన్న గ్రామంపై ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపుకు చెందిన ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

దియాలా ప్రావిన్స్‌లోని బకౌబాకు ఈశాన్య భాగంలో ఉన్న అల్-రషాద్‌లో షియాలు ఎక్కువగా ఉండే గ్రామంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్​ ఉగ్రవాదులు.. ఇంతకుముందు ఇద్దరు గ్రామస్థులును కిడ్నాప్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం గ్రామంపై దాడికి దిగినట్లు వివరించారు. ఈ దాడిలో మిలిటెంట్లు మిషన్​ గన్​లను ఉపయోగించినట్లు తెలిపిన అధికారులు.. దీనిలో బాధితులు అందరూ సాధారణ పౌరులేనని స్పష్టం చేశారు.

జులైలో కూడా ఇలాంటి దాడి జరిగి.. 30 మందికిపైగా మరణించారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.

ఇదీ చూడండి: తాలిబన్లకు చైనా భారీ సాయం- పాక్​తో కలిసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.