ETV Bharat / international

ఐఎస్ కమాండర్​ను హతమార్చిన ఇరాక్​

author img

By

Published : Jan 29, 2021, 8:51 AM IST

ఐఎస్​ సీనియర్​ కమాండర్​ను తమ దేశ సైనికులు హతమార్చారని ఇరాక్​ ప్రధాని ముస్తఫా అల్​-కాధిమి తెలిపారు. దీంతో బాగ్దాద్​లో ఉగ్రవాదులు ఇటీవల జరిపిన వరుస ఆత్మాహుతి దాడులకు ఆ దేశం ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.

ఐఎస్ కమాండర్​ను హతమార్చిన ఇరాక్​
ఐఎస్ కమాండర్​ను హతమార్చిన ఇరాక్​

ఇస్లామిక్​ స్టేట్​(ఐఎస్​) గ్రూపునకు చెందిన సీనియర్​ కమాండర్​ను తమ దేశ భద్రతా బలగాలు హతమార్చాయని ఇరాక్​ ప్రధాని ముస్తఫా అల్​-కాధిమి తెలిపారు. ఉత్తర ఇరాక్​లో నిఘా విభాగం నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్​లో డిప్యూటీ కమాండర్​, ఐఎస్​ చీఫ్​ అబూ యాసర్​ అల్​-ఇస్సావి(39) మృతిచెందాడని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

బాగ్దాద్​లోని రద్దీగా ఉన్న మార్కెట్​ ప్రదేశాల్లో ఈ నెల 21న పేలుళ్లు జరిగాయని చెప్పారు ముస్తఫా. ఈ ఘటనలో సుమారు 32 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఇస్లామిక్ స్టేట్​ గ్రూప్​ బాధ్యత వహించినట్టు తెలిపింది. ఫలితంగా.. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్​ చేపట్టాయి ఇరాక్​ సైనిక బలగాలు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇస్సావి(ఐఎస్​ కమాండర్​) చనిపోయాడని ఉగ్రవాద నిరోధక సంస్థ తన ఫేస్​బుక్​లోతెలిపింది.

ఇదీ చదవండి: చైనాలో మలద్వార స్వాబ్​ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.