ETV Bharat / international

ఇరాన్ ప్రముఖ అణు శాస్త్రవేత్త హత్య - మొహ్సేన్ ఫఖ్రిజాదే బోర్

ఇరాన్​ అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే శుక్రవారం హత్యకు గురయ్యారు. ఈ చర్యకు కారణం ఇజ్రాయెల్​ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జారిఫ్ అనుమానం వ్యక్తం చేశారు.

Iran scientist linked to military nuclear program killed
ఆకస్మిక దాడిలో ఇరాన్​ శాస్త్రవేత్త మృతి
author img

By

Published : Nov 28, 2020, 6:15 AM IST

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న మొసిన్ ఫక్రజాదే శుక్రవారం హత్యకు గురయ్యారు. టెహ్రాన్​ శివారులోని అబ్సాద్ గ్రామంలో ఈయన కారుపై దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడిన మొసిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఇరాన్ పేర్కొంది.

శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే మృతిపై స్పందించిన ఇరాన్​ విదేశాంగ మంత్రి జావెద్ జారిఫ్...ఈ హత్యలో ఇజ్రాయెల్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ, దానిపై పూర్తి వివరణ ఇవ్వలేదు.

దశాబ్దం క్రితం అనేక మంది ఇరాన్​ అణు శాస్త్రవేత్తలను హత్య చేశారని ఇజ్రాయెల్​పై ఆరోపణలు ఉన్న మాట నిజమే అయినా ...ఈ హత్యపై ఇజ్రాయెల్ స్పందించలేదు.

ఇజ్రాయెల్​ హస్తం...!

పదేళ్ల క్రితం నవంబర్​లోనే ఇరాన్ అణు శాస్త్రవేత్త మాజీద్ షహర్యారి హత్యకు గురయ్యారు. 2010 నుంచి 2012 మధ్య నలుగురు ఇరాన్ అణుశాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. వీరి మరణాల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ 'మొసాద్' హస్తం ఉందని ఇరాన్ నమ్ముతోంది.

ఫక్రజాదే హత్య ఇరాన్​కు పెద్ద ఎదురుదెబ్బ అని ఇజ్రాయెల్​ జర్నలిస్టు యోసిమెల్మన్ ట్వీట్​ చేశారు. దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్​ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు సంభవించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:శ్రీలంక ప్రధానిని కలిసిన అజిత్​ డోభాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.