ETV Bharat / international

'అణు కేంద్రంపై దాడికి కారకుడు ఇతడే'

నతాంజ్​లోని అణుకర్మాగారంపై జరిగిన దాడికి కారకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి పేరును ఇరాన్​ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అతడిని పట్టుకునేందుకు 'రెడ్​ నోటీసు'ను జారీ చేసింది.

Natanz attack,
ఇరాన్​ న్యూక్లియర్​ కేంద్రం
author img

By

Published : Apr 17, 2021, 6:26 PM IST

నతాంజ్​లోని అణు కర్మగారంపై ఇటీవల జరిగిన దాడికి కారకుడిగా భావిస్తున్న ఓ అనుమానితుడి పేరును ఇరాన్​ బయటపెట్టింది. ఈ దాడి జరగడానికి కంటే ముందు సదరు వ్యక్తి తమ దేశాన్ని వదిలి వెళ్లాడని చెప్పింది. ఈ మేరకు 43ఏళ్ల రేజా కారిమిని అనుమానితుడిగా పేర్కొంటూ అక్కడి ప్రభుత్వ మీడియా(స్టేట్​ టీవీ) కథనం వెలువరించింది. కాషన్​ నగరంలో అతడు జన్మించినట్లుగా చెప్పింది. అతడి పాస్​పోర్ట్​ ఫొటోను విడుదల చేసింది.

అయితే.. అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉన్న నతాంజ్​ అణుకర్మాగారంలోకి రేజా కారిమి ఎలా వెళ్లాడనే దానిపై 'స్టేట్​ టీవీ' స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారిమిని అరెస్టు చేసేందుకు వీలుగా అతడిపై 'రెడ్​ నోటీసు'ను ఇరాన్​ ప్రభుత్వం జారీ చేసినట్లు చెప్పింది. కారిమిని తిరిగి ఇరాన్​కు రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం అధికారిక చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది.

యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు ఇరాన్‌ ప్రారంభించిన ఆధునాతన న్యూక్లియర్‌ సెంట్రిఫ్యూజ్‌ ఐర్‌-9పై ఏప్రిల్​ 11న దాడి జరిగింది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో యంత్రాన్ని పనిచేయించడం మెుదలుపెట్టిన కొద్ది గంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ కుప్పకూలింది.

ఇదీ చూడండి:ఇరాన్​ దూకుడు- యురేనియం శుద్ధి ప్రక్రియ షురూ

ఇదీ చూడండి:ఇరాన్​ 'అణు' దూకుడు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.