హిందూ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామికి చెందిన పలు శకలాలు లభ్యమైనట్లు ఇండోనేసియా నౌకాదళం తెలిపింది. 53 మంది సిబ్బందితో ఈనెల 21న బాలి ద్వీపానికి సమీపంలో గల్లంతైన క్రమంలో గాలింపు చర్యలు చేపట్టింది నౌకాదళం.
జలాంతర్గామివిగా భావిస్తున్న టర్పెడో స్ట్రేయ్ట్నర్, ఓ గ్రీజ్ బాటిల్లను సహాయక బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు నౌకాదళ చీఫ్ అడ్మిరల్ యుడో మార్గోనో తెలిపారు.
"జలాంతర్గామికి చెందినవిగా భావిస్తున్న ప్రామాణిక ఆధారాలతో సబ్మెరైన్ మునిగిపోయినట్లు భావిస్తున్నాం. "
- యుడో మార్గోనో, నౌకాదళ చీఫ్
ఇప్పటి వరకు జలాంతర్గామి గల్లంతైందని భావిస్తోన్న ఇండోనేషియా నౌక.. మునిగిపోయినట్లు అధికారికంగా ధ్రువీకరించింది ఆ దేశ నౌకాదళం. అందులోని సిబ్బంది ఎవరూ ప్రాణాలతో ఉన్నట్లు అనుకోవటం లేదని పేర్కొంది. ఆక్సిజన్ కూడా శనివారం ఉదయానికి అయిపోయి ఉంటుందని తెలిపింది.
ఆచూకీ గల్లంతైన జలాంతర్గామి కోసం సింగపూర్, ఆస్ట్రేలియాలతో పాటు భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగింది.
ఇవీ చూడండి: 53 మందితో ఇండోనేసియా జలాంతర్గామి గల్లంతు