ETV Bharat / international

లోయలో పడ్డ బస్సు- 27మంది యాత్రికులు మృతి - బస్సు ప్రమాదం యాత్రికులు మృతి

Indonesia bus plunges into a ravine, killing 26 pilgrims
లోయలో పడ్డ బస్సు- 26మంది యాత్రికులు మృతి
author img

By

Published : Mar 11, 2021, 7:11 AM IST

Updated : Mar 11, 2021, 9:11 AM IST

07:08 March 11

లోయలో పడ్డ బస్సు- 27మంది యాత్రికులు మృతి

Indonesia bus plunges into a ravine, killing 26 pilgrims
సహాయక చర్యలు

ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జావా ద్వీపంలో ఓ యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 27మంది మరణించారు. మరో 39మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  

బస్సు బ్రేకులు పనిచేయకపోవడమే ఘటన జరగడానికి కారణమని తెలుస్తోంది.

పశ్చిమ జావా రాష్ట్రంలోని సుబాంగ్​ పట్టణం నుంచి తసిక్​మాలయ జిల్లాకు వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇస్లామ్​ జూనియర్​ హై స్కూల్​ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు.

బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతంలో అనేక మలుపులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. వాహనంపై డ్రైవర్​ అదుపు కోల్పోవడం వల్ల బస్సు 20 అడుగుల లోయలో పడిపోయిందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- ప్రకృతి బీభత్సంలో 10కి చేరిన మృతులు

Last Updated : Mar 11, 2021, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.