ETV Bharat / international

వుహాన్​లో చైనీయుల సంబురాలు.. భారతీయుల్లో ఆందోళన! - కరోనా వైరస్​ వుహాన్​

కరోనా వైరస్​ కేంద్రబిందువైన చైనా.. వుహాన్​ నుంచి అనేక మంది భారతీయులను ప్రభుత్వం వెనక్కి రప్పించింది. అయితే కొందరు మాత్రం స్వచ్ఛందంగా, వ్యక్తిగత కారణాల వల్ల అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వుహాన్​లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కానీ భారతీయుల్లో మాత్రం భయాందోళనలు తగ్గడం లేదు. రెండో దశ కరోనా వైరస్​ విజృంభించే అవకాశాలున్నాయని వారు భయపడుతున్నారు. ఇందుకు కారణం పెరుగుతున్న ఎసింప్టోమాటిక్​(లక్షణాలు కనపడని) కేసులు.

Indians still in Wuhan say asymptomatic cases raise fears of 2nd wave of coronavirus
కరోనా 2.0పై వుహాన్​లోని భారతీయుల ఆందోళన
author img

By

Published : Apr 29, 2020, 6:28 AM IST

వుహాన్​... కరోనా వైరస్​ కేంద్రబిందువైన చైనాలోని ఓ నగరం. చివరి వైరస్​ బాధితుడు ఆదివారం డిశ్చార్జ్​ అవడం వల్ల వుహాన్​ సంబరాలు జరుపుకుంటోంది. కానీ అక్కడ ఉంటున్న భారతీయుల్లో మాత్రం ఇంకా భయాందోళనలు పోలేదు. వైరస్ 2.0​ విజృంభించే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం అక్కడ పెరుగుతున్న ఎసింప్టోమాటిక్​(లక్షణాలు కనబడని) కేసులు.

లాక్​డౌన్​ ఎత్తివేసినా...

వైరస్​ వల్ల వుహాన్​లో 50వేల 333 కేసులు, 3వేల 869 మరణాలు నమోదయ్యాయి. 11 మిలియన్​ జనాభా గల నగరం.. 76 రోజుల లాక్​డౌన్​ అనంతరం ఈ నెల 8న విముక్తి పొందింది. అయితే వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో 600మంది భారతీయ విద్యార్థులు, నిపుణులను ఫిబ్రవరిలో ప్రభుత్వం వెనక్కి రప్పించింది. కానీ కొందరు వృత్తి, వ్యక్తిగత కారణాలతో అక్కడే ఉండేందుకు ధైర్యం చేశారు.

వుహాన్​లో గత కొద్ది రోజులుగా ఎలాంటి కొత్త కేసులు, మరణాలు నమోదవడం లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ పేర్కొంది. అయితే చైనా వ్యాప్తంగా సోమవారం మాత్రం.. ఎలాంటి లక్షణాలు బయటపడని 40 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ తరహా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 997కు చేరింది. ఇందులో 130మంది విదేశీయులున్నారు.

"ఇలాంటి కేసుల వల్ల వుహాన్​ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నగరం, అందులోని కార్యాలయాల్లో ఎవరికి వైరస్ సోకిందో చెప్పలేం. అందువల్ల చాలా మంది ఉద్యోగం తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరికొందరు నిత్యావసర వస్తువుల కోసం తప్పా అసలు బయటికే రావడం లేదు. నగరంలో వైరస్​ రెండో దశ వ్యాప్తిపై అనేక మందికి అనుమానాలున్నాయి.​"

-- వూహాన్​లోని భారతీయుడు.

వైరస్​ నుంచి కోలుకున్న వారికీ తిరిగి కరోనా సోకుతుందని కూడా అనేక మంది భావిస్తున్నట్టు మరో భారతీయుడు తెలిపారు. ప్రస్తుతానికి.. వైరస్​ ఎలా వచ్చిందనే విషయం కన్నా దాన్ని కట్టడి చేసే అంశంపై దృష్టి సారించాలని మరొకరు అభిప్రాయపడ్డారు.

అయితే వీరిలోని కొందరు.. భారత్​లోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు. కుటుంబసభ్యులు ఇన్నిరోజులు తమ గురించి భయపడ్డారని.. ఇప్పుడు తాము భారత్​లోని బంధువుల గురించి ఆందోళన చెందుతున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'ఆ ప్యాకేజీల్లోని 1% నిధులతోనే 70 కోట్ల మందికి భోజనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.