ETV Bharat / international

'ఆ ప్యాకేజీల్లోని 1% నిధులతోనే 70 కోట్ల మందికి భోజనం'

author img

By

Published : Apr 28, 2020, 3:38 PM IST

కరోనా వైరస్​తో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఇప్పటికే అనేకమంది ఆకలితో అలమటిస్తున్నారు. పేద దేశాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే 90 బిలియన్​ డాలర్ల ఆర్థిక సహాయంతో ప్రపంచవ్యాప్తంగా దయనీయ స్థితిలో ఉన్న 700 మిలియన్​ మందిని రక్షించుకోవచ్చని ఐరాస తెలిపింది. ఈ మొత్తంతో వారందరికీ ఆదాయం, ఆరోగ్యం, ఆహార పరంగా సహాయం అందుతుందని స్పష్టం చేసింది.

UN: USD 90 billion could protect 700 million poor in pandemic
'9వేల కోట్ల డాలర్లతో 700 మిలియన్​ పేదలకు రక్షణ'

9వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది పేదలను రక్షించవచ్చని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కరోనా వైరస్​ నేపథ్యంలో ఈ 90 బిలియన్​ డాలర్లతో పేదల ఆదాయం, ఆరోగ్యం, ఆహారం వంటికి ఆటంకం కలగకుండా చూసుకోవచ్చని యూఎన్​ హ్యుమానిటేరియన్​ చీఫ్​ మార్క్​లోకుక్​ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు 20 ధనిక దేశాలు మంజూరు చేసిన ప్యాకేజీ(8 ట్రిలియన్​ డాలర్ల)ల్లో ఇది కేవలం 1శాతంగా ఉండటం గమనార్హం.

పేద దేశాలపై కరోనా వైరస్​ ఇంకా పంజా విసరలేదని లోకుక్​ తెలిపారు. అయితే రానున్న 3-6 నెలల్లో ఆ దేశాలపై వైరస్​ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.

ఈ 70 కోట్ల మంది ప్రజలు 30-40 దేశాలకు చెందిన వారని.. వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉందని లోకుక్​ తెలిపారు. ఇప్పటికే వీరికి సహాయం అందుతోందని స్పష్టం చేసిన ఆయన.. కరోనా వైరస్​ విజృంభణతో ప్రభుత్వాలు తీసుకునే కఠిన నిర్ణయాలతో వారి ఆదాయం దెబ్బతింటుందన్నారు.

పేద దేశాల్లోని వీరి ఆదాయంలో మార్పులు రాకుండా చూసుకోవాలంటే 60 బిలియన్​ డాలర్లు సరిపోతాయన్నారు లోకుక్​. మిగిలిన 30 బిలియన్​ డాలర్లతో వీరి ఆకలిని తీర్చవచ్చని.. ఆరోగ్య వసతులు కల్పించవచ్చని పేర్కొన్నారు.

ఈ 90 బిలియన్లలో మూడింట రెండు వంతులు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సమకూర్చవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం వారి విధివిధానాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. మిగిలినవి ప్రభుత్వ అభివృద్ధి సహాయంతో అందించవచ్చని పేర్కొన్నారు.

అయితే ఈ 90 బిలియన్​ డాలర్ల కోసం ఐరాస పిలుపునివ్వదని లోకుక్​ స్పష్టం చేశారు. కానీ ఈ మొత్తంతో అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని, బాధ నుంచి విముక్తి చేయవచ్చన్నారు.

ఇదీ చూడండి:- వైరస్‌పై పోరులో సరికొత్త ఆవిష్కరణలే శరణ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.