ETV Bharat / international

న్యూజిలాండ్​ ఎంపీగా సంస్కృతంలో ప్రమాణం - న్యూజిలాండ్​ పార్లమెంట్​

న్యూజిలాండ్​ ఎంపీగా భారతీయుడు డా. గౌరవ్​ శర్మ సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. భారత్​-న్యూజిలాండ్​ సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువకు ఇది అద్దంపడుతోందని శర్మకు ప్రశంసలు లభించాయి.

Indian-origin MP in New Zealand takes oath in Sanskrit
న్యూజిలాండ్​ ఎంపీగా సంస్కృతంలో భారతీయుడు ప్రమాణం
author img

By

Published : Nov 25, 2020, 4:51 PM IST

న్యూజిలాండ్​లో గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డా. గౌరవ్​ శర్మ.. తాజాగా ఆ దేశ పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. 33ఏళ్ల గౌరవ్​.. సంస్కృతంలో ప్రమాణం చేయడం విశేషం.

తొలుత న్యూజిలాండ్​ అధికారిక భాష మోరీలో ప్రమాణస్వీకారం చేసిన గౌరవ్​.. ఆ తర్వాత సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు. భారత్​- న్యూజిలాండ్​ సంప్రదాయానికి ఆయన ఇచ్చే విలువకు ఇది అద్దంపడుతోందని ఆ దేశంలోని భారత హైకమిషన్​ ట్వీట్​ చేసింది.

ఈ నేపథ్యంలో హిందీలో ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని ఓ నెటిజెన్​ గౌరవ్​ను ప్రశ్నించారు. నిజానికి తాను హిందీలోనే ప్రమాణస్వీకారం చేద్దామనుకున్నట్టు వెల్లడించారు ఆయన. కానీ సంస్కృతం అయితే అన్ని భాషలకు నివాళినిస్తున్నట్టు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

20ఏళ్ల క్రితం..

20 ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ గౌరవ్‌ అధికార లేబర్‌ పార్టీ నుంచి పోటీచేసి ప్రత్యర్థి టిమ్‌ మసిండోపై 4,425 ఓట్లు తేడాతో జయకేతనం ఎగురవేశారు.

ప్రజల కష్టాలపై గళమెత్తే గౌరవ్‌ పలు దేశాల్లోని శరణార్థుల హక్కులకోసం పోరాడారు. 2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచారు. వారు నివాసాలు ఏర్పరుచుకునేందుకు తోడ్పాటునందించారు. కరోనా కాలంలో హామిల్టన్‌లో విశేష సేవలందించారు.

ఇదీ చూడండి:- మరో 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్​ఎక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.