ETV Bharat / international

దుబాయ్​లో మరో భారతీయుడికి జాక్​పాట్​ - దుబాయ్

దుబాయ్​లో నివసించే ఓ ప్రవాస భారతీయుడికి అదృష్టం కలిసొచ్చింది. ఓ లాటరీలో రూ.24కోట్లు గెలుచుకున్నాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని తన పిల్లల పేర బ్యాంక్​లో డిపాజిట్​ చేయనున్నట్లు తెలిపాడు.

lucky draw
దుబాయ్​ లక్కీడ్రాలో రూ.24కోట్లు గెలుపొందిన భారతీయుడు
author img

By

Published : Mar 4, 2021, 5:51 PM IST

యూఏఈలో మరో ప్రవాస భారతీయుడిని అదృష్టం తలుపు తట్టింది. దుబాయిలో నిర్వహించిన లక్కీడ్రాలో కర్ణాటక శివమొగ్గకు చెందిన శివమూర్తి క్రిష్ణప్ప.. 202511 టికెట్​తో రూ.24కోట్లు గెలుచుకున్నాడు.

క్రిష్ణప్ప 15ఏళ్లుగా దుబాయ్​లో మెకానికల్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. అతనికి 10, 4 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఏడాది నుంచి ప్రతినెలా లాటరీ టికెట్లు కొంటున్నాడు. అలాగే.. ఫిబ్రవరి17న లాటరీ టికెట్​ కొన్నాడు క్రిష్ణప్ప. లక్కీడ్రాలో అతను కొనుగోలు చేసిన టికెట్​కే బహుమతి లభించింది.

"లక్కీడ్రా ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాను. డ్రాలో నేను రూ.24 కోట్లు గెలుచుకున్నానంటే ఇంకా నమ్మలేక పోతున్నా. ఈ డబ్బుతో సొంత ఊరిలో పెద్ద ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాను. కొంత డబ్బును నా పిల్లల పేరున బ్యాంకులో డిపాజిట్​ చేస్తాను."

శివమూర్తి క్రిష్ణప్ప, మెకానికల్​ ఇంజినీర్

దుబాయ్​లో ఉన్న పలువురు ప్రవాస భారతీయులు లాటరీ టికెట్లు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్న సంఘటనలు చాలా వరకు చూస్తూనే ఉన్నాం.

ఇదీ చూడండి: దుబాయ్​లో భారతీయుడిని వరించిన అదృష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.