అఫ్గాన్ మధ్యంతర ప్రభుత్వానికి (Taliban interim govt) చెందిన ఉన్నత స్థాయి తాలిబన్ (Taliban news) బృందం.. భారత అధికారులతో (Taliban meeting with India) సమావేశమైంది. రష్యాలోని మాస్కోలో జరుగుతున్న సమావేశాల్లో భాగంగా.. అఫ్గాన్ ఉప ప్రధాని అబ్దుల్ సాలమ్ హనాఫీ భారత అధికారులతో చర్చలు (Taliban meeting with India) జరిపారు. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ శాఖ విభాగ సంయుక్త కార్యదర్శి జేపీ సింగ్ నేతృత్వం వహించారు.
'మాస్కో ఫార్మాట్' సమావేశానికి హాజరయ్యేందుకు భారత అధికారులు రష్యాకు వెళ్లారు. ఈ సమావేశానికి అనుబంధంగా తాలిబన్లతో భేటీ (Taliban meets Indian) అయ్యారు. అయితే దీనిపై భారత్ అధికారిక ప్రకటన చేయలేదు. అఫ్గాన్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. భారత్- తాలిబన్ల మధ్య జరిగిన తొలి అధికారిక సమావేశం ఇదే అని తెలుస్తోంది.
'సాయం చేస్తాం'
మానవతా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాస్కోలో తాలిబన్లతో (Taliban meeting in Russia) సమావేశంలో భాగంగా భారత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విస్తృత సహకారం అందించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు భారత్ స్పష్టం చేసిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య ఉన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని.. దౌత్య, ఆర్థికపరమైన సంబంధాలను మెరుగపర్చుకునేందుకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
'ప్రభుత్వాన్ని గుర్తించండి'
మరోవైపు, అఫ్గాన్ ప్రభుత్వాన్ని (Taliban interim govt) ప్రపంచ దేశాలు గుర్తించాలని మాస్కో సమావేశంలో అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు తాలిబన్ ఉప ప్రధాని హనాఫీ. అఫ్గాన్ ఏకాకిగా ఉండటం.. ఎవరికీ ప్రయోజనకరం కాదని అన్నారు. గతంలోనూ ఇదే విషయం రుజువైందని చెప్పారు. అఫ్గానిస్థాన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 9.4 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలని అమెరికాను కోరారు.
ఇదీ చదవండి: