ETV Bharat / international

భారత్​కు రెండో అవకాశం ఇవ్వబోం: పాక్​ - పాకిస్థాన్

పాకిస్థాన్​ చెరలో ఉన్న భారత నావికా దళ విశ్రాంత అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ను దౌత్యపరంగా కలిసేందుకు భారత్​కు మరో అవకాశం ఇవ్వబోమని పాకిస్థాన్​ తేల్చిచెప్పింది.

భారత్​కు ఇక రెండో అవకాశం ఇవ్వం: పాక్​
author img

By

Published : Sep 12, 2019, 3:42 PM IST

Updated : Sep 30, 2019, 8:38 AM IST

భారత్​తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్థాన్​ పలు కీలక వ్యాఖ్యలు చేస్తోంది. పాక్‌ చెరలో ఉన్న భారత నావికా దళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను దౌత్యపరంగా కలుసుకోవడానికి భారత్‌కు రెండోసారి అవకాశం ఇవ్వబోమని తాజాగా పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ప్రకటన చేశారు.

దౌత్యపరంగా జాదవ్‌ను కలుసుకునే అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ న్యాయస్థానం గతంలో పాక్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న పాక్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా జాదవ్‌ను కలుసుకున్నారు.

యాత్రికులకు రుసుం...

కర్తార్‌పుర్‌ను సందర్శించే భారత సిక్కు యాత్రికుల ఒక్కొక్కరి నుంచి సేవా రుసుము కింద 20 డాలర్లను వసూలు చేయనున్నట్లు ఫైజల్​ వెల్లడించారు. ఇది ప్రవేశ రుసుం కాదన్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్ విషయంలో ఇమ్రాన్​కు పాక్​ మంత్రి షాక్​​

Ranchi (Jharkhand), Sep 12 (ANI): PM Narendra Modi inaugurated new Vidhan Sabha building in Ranchi on September 12. He will also lay foundation stone to the new secretariat building at Ranchi. The Chief Minister of Jharkhand Raghubar Das cabinet approved a special Assembly session of the fourth Jharkhand Vidhan Sabha on Sep 13.
Last Updated : Sep 30, 2019, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.