ETV Bharat / international

భారత్​-అమెరికాల 'అణు'బంధం - చైనా

భారత్​-అమెరికాల మధ్య ద్వైపాక్షిక పౌర అణు ఇంధన సహకార ఒప్పందం కుదిరింది. దీన్ని అనుసరించి భారత్​లో 6 అణువిద్యుత్ కేంద్రాలను నిర్మించనుంది అమెరికా.

భారత్​లో యూఎస్​ అణువిద్యుత్​ కేంద్రాలు
author img

By

Published : Mar 14, 2019, 12:33 PM IST

భారత్​- అమెరికా ద్వైపాక్షిక పౌర అణు ఒప్పందంలో మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య తాజాగా ద్వైపాక్షిక పౌర అణు ఇంధన సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అమెరికా ఆరు అణు విద్యుత్​ ప్లాంట్లను భారత్​లో నిర్మిస్తుంది.

భారత్​-అమెరికాల మధ్య తాజాగా 9వ రౌండ్​ వ్యూహాత్మక భద్రతా చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా ఇరుదేశాలు 'ద్వైపాక్షిక పౌర అణు ఇంధన సహకార ఒప్పందం'పై ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్​ గోఖలే, అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రతా కార్యదర్శి ఆండియా థాంప్సన్​ పాల్గొన్నారు.

"భారత్​లో 6 అణు విద్యుత్ కేంద్రాలను అమెరికా​ ఏర్పాటు చేస్తుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక భద్రత, పౌర అణు సహకారాన్ని బలోపేతం చేసేందుకు మేము కట్టిబడి ఉన్నాం."- భారత్​-అమెరికా సంయుక్త ప్రకటన

చారిత్రక ఒప్పందం...

భారత్​ అమెరికాల మధ్య 2008, అక్టోబర్​లో చారిత్రక 'పౌర అణు ఒప్పందం' జరిగింది. పౌర అణుశక్తి రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందాయి.

ఈ ఒప్పందం వల్ల 'అణు సరఫరా దేశాల సమూహం' (ఎన్​ఎస్​జీ)లో భారతదేశం చేరకపోయినా ప్రత్యేక మినహాయింపు లభించింది.
ఫలితంగా భారత్​ 'పౌర అణు సహకార ఒప్పందాన్ని' అమెరికా, ఫ్రాన్స్​, రష్యా, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, యూకే, జపాన్​, వియత్నాం, బంగ్లాదేశ్, ఖజకిస్థాన్​, దక్షిణ కొరియాతో చేసుకోగలిగింది.

మోకాలడ్డుతున్న చైనా...

బుధవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, 'ఎన్​ఎస్​జీ'లో భారత సభ్యత్వానికి అమెరికా మరోసారి మద్దతు తెలిపింది. కాగా అణ్వాయుధాల విస్తరణను నివారించడానికి ప్రయత్నిస్తోన్న 48 సభ్య దేశాలు గల ఎన్​ఎస్​జీలో భారత్​ సభ్యత్వం పొందకుండా చైనా కొంత కాలంగా అడ్డుకుంటోంది.

Meerut (UP), Mar 13 (ANI): After Congress general secretary for UP (East) Priyanka Gandhi Vadra on Wednesday met Bhim Army chief Chandrashekhar at Meerut hospital, he said that the Congress leader just came to ask about his health. He said, "She came to ask about my health and asked me about what happened with me." On being asked if he is fighting elections, Chandrashekar said that he is not willing to fight elections and only wants the rule of the 'bahujan samaj'. Chandrashekhar was arrested on Tuesday for alleged violation of the model code of conduct after he came out with hundreds of his supporters to rally in Deoband. While taking immediate action on the rally without permission, the police arrested Chandrashekhar along with the supporters from Deoband in Uttar Pradesh.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.