భారత్-రష్యా మధ్య స్నేహబంధం కాల పరీక్షను తట్టుకొని నిలబడిందని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi on russia). కొవిడ్-19 మహమ్మారి(Covid-19 pandamic) సమయంలో, టీకా పంపిణీలో(Corona vaccination) ఇరు దేశాల మధ్య సహకారం ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
వ్లాదివోస్టోక్ వేదికగా జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ (ఈఈఎఫ్) ప్లీనరీలో(eastern economic forum india) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ప్రధాని మోదీ.
" ఈ సదస్సులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్షుడు పుతిన్‌కు కృతజ్ఞతలు. భారత చరిత్రలో 'సంఘం' పదానికి సంగమం లేదా నదులు, ప్రజలు, ఆలోచనల కలయిక అనే ప్రత్యేక అర్థం ఉంది. నా ఆలోచన ప్రకారం వ్లాదివోస్టోక్ నిజంగా యురేషియా, పసిఫిక్‌కు ఒక సంగమం. రష్యా అభివృద్ధి కోసం అధ్యక్షుడు పుతిన్ ఆలోచనలు, దూరదృష్టికి నా అభినందనలు. గగన్‌యాన్‌తో అంతరిక్ష పరిశోధనల్లో ఇరు దేశాలు భాగస్వాములయ్యాయి. అంతర్జాతీయ వ్యాణిజ్యం కోసం ఉత్తర సముద్ర మార్గాన్ని తెరిచేందుకు ఇరు దేశాలు కృషి చేశాయి.
భారత్, రష్యా మధ్య ఉన్న స్నేహబంధం గొప్పది. ఇటీవల కొవిడ్-19 సమయంలో అది నిరూపితమైంది. ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడంలో భారత్, రష్యా సహాయపడతాయి. భారత్‌లో అద్భుతమైన మేథాశక్తితో పాటు ఎన్నో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇరు దేశాల అభివృద్ధికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
గవర్నర్లకు ఆహ్వానం..
రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని 11 ప్రాంతాల గవర్నర్లు త్వరలోనే భారత్‌లో పర్యటించాలని సదస్సు వేదికగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు మోదీ. ఆ సమయంలో యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించినట్లు చెప్పారు. అది రష్యాతో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.
రష్యాపై ప్రశంసలకు కారణం అదేనా?
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన క్రమంలో వారికి రష్యా, చైనా మాత్రమే మద్దతు పలికాయి. మరోవైపు.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గాన్ కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని మొదటి నుంచి కేంద్రం ఆందోళన చెందుతోంది. కశ్మీర్ అంశంపై తాలిబన్ల తాజా ప్రకటన(Taliban on Kashmir) సైతం ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే రష్యాతో సన్నిహితంగా ఉంటే.. తాలిబన్ల సమస్యను పరిష్కరించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యాపై మోదీ ప్రశంసలు కురిపించడం, భారత పర్యటనకు గవర్నర్లను ఆహ్వానించటం ఇందులో భాగంగానే కనిపిస్తోంది.
ఇదీ చూడండి: Taliban on Kashmir: కశ్మీర్‌పై మాట మార్చిన తాలిబన్లు!