ETV Bharat / international

భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

భారత్​-చైనా మధ్య వివాదాస్పద వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇటీవలె రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, ఆ ప్రాంతంలో ఇరుదేశాల యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడం పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్​ను పావుగా వాడుకొని మన దేశానికి ఇబ్బందులు సృష్టించాలని డ్రాగన్​ దేశం పన్నాగం పన్నుతోందా? ఈ అంశంపై నేపాల్​లో పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త రంజిత్​ రే, బ్రూకింగ్స్ ఇండియా సభ్యుడు క్రిస్టియానో జేవియర్​తో చర్చించారు ఈటీవీ భారత్​ సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ.

India-Nepal diplomatic row and China's shadow
నేపాల్​-భారత్​ను ప్రత్యర్థులుగా మార్చే ప్రయత్నాల్లో చైనా?
author img

By

Published : May 13, 2020, 5:04 PM IST

గతేడాది నవంబర్​లో ఆర్టికల్​ 370, 35 ఏ రద్దు తర్వాత... భారత ప్రభుత్వం కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లను సూచిస్తూ భౌగోళిక మ్యాప్​​ను విడుదల చేసింది. ఆ రేఖాపటంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, కాలాపానీ కూడా ఉంది. అయితే కాలాపానీని మ్యాప్​లో గుర్తించడంపై నేపాల్​ అభ్యంతరం లేవనెత్తగా.. అది తమ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది భారత్​.

ఇటీవల చైనా సరిహద్దులో అత్యంత కీలకమైన రహదారిని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని దార్చులా నుంచి లిపులేఖ్‌ కనుమ వరకు 80 కి.మీ. పొడవున దీనిని నిర్మించారు. సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి కారణంగా కైలాస్‌-మాన్‌సరోవర్‌ వెళ్లడానికి మార్గం సుగమమయింది. లిపులేఖ్‌ కనుమ నుంచి మాన్‌సరోవర్‌ కేవలం 90 కి.మీ.దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో మాన్‌సరోవర్‌ యాత్రకు ఇంతవరకు మూడు వారాల సమయం పడుతుండగా, ఈ రహదారి కారణంగా వారంలోనే ముగించే అవకాశం ఉంది. సరిహద్దులో సైనిక బలగాలను వేగంగా తరలించడానికి కూడా వీలు కలిగింది.

ఈ రహదారి ప్రారంభంతో మరోసారి భారత్​​-నేపాల్​ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలాపానీ తమదని కాఠ్​మాండూ ప్రభుత్వం ఉద్ఘాటించింది.

మాదే అంటున్న నేపాల్​..

భారత్ రహదారి ప్రారంభించడాన్ని ఖండించిన నేపాల్.. తమ​ భూభాగంలో ఎటువంటి కార్యకలాపాలకు అనుమతి లేదని చెప్పింది. అంతేకాకుండా 1816 సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నది తూర్పున ఉన్న లింపియాదుర,కాలాపానీ, లిపు లేఖ్​లు నేపాల్​లో భాగమని పేర్కొంది. దీనిపై భారత్​ తీవ్రంగా స్పందించింది. నేపాల్​ ఆరోపణలను ఖండించమే కాకుండా ఇటీవల ప్రారంభించిన రహదారి భారత్​లోని ఉత్తరాఖండ్​లోనిదని స్పష్టం చేసింది. అలనాటి సుగౌలీ ఒప్పందాన్ని మరోసారి ఉదహరించింది.

Kalapani region
కాలాపానీ ప్రాంతం

ఏమిటీ 'సుగౌలీ ఒప్పందం'?

భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌, నేపాల్‌లోని దర్చులా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. మహాకాళి నది ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తోంది. 1816లో 'సుగౌలీ' ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్‌ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. మహాకాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి. ఈ ప్రాంతం ట్రై జంక్షన్‌ లాంటింది. నేపాల్‌, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి ప్రాధాన్యం ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యం ఉందో కాలాపానీకి అంతే గుర్తింపు ఉంది. 1962 భారత్‌-చైనా యుద్దం నాటి నుంచి కాలాపానీ భారత్‌ అధీనంలో ఉంది.

మాటలకు ముందే బలగాలతో..

సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశమవ్వాలని భావిస్తున్నారు. కొవిడ్​-19 ఇబ్బందులు సద్దుమణిగాక ఈ అంశంపై చర్చించవచ్చని భారత్​ స్పష్టం చేసింది. ఇప్పటకే ద్వైపాక్షికంగా చర్చించుకొని పరిష్కరించుకునే అంశాలను కొందరు నిపుణులు నివేదిక రూపంలో తయారు చేసి ప్రధాని మోదీకి అందజేశారు. ఈలోగా పశ్చిమ సరిహద్దు(భారత్​ తూర్పు ప్రాంతంలో) వద్ద సైనిక దళాలను మరింత పెంచాలని నేపాల్​ విదేశాంగ మంత్రి ప్రదీప్​ గ్యావాలీ.. ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. భారత్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు గొడవ పరిష్కారమయ్యే వరకు ఈ చర్యలు చేపట్టాలన్నారు.

చైనా హస్తం ఉందని నిపుణుల అభిప్రాయం...

భారత్​పై నేపాల్ ఎందుకు గళమెత్తుతోంది? నేపాల్​ వెనుక ఉండి భారత్​ను ఇబ్బంది పెట్టాలని చైనా భావిస్తోందా? నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలపర్చుకోడానికి భారత ప్రభుత్వం వ్యూహరచన ఏంటి? భూభాగాన్ని ఉల్లంఘించినట్లు నేపాల్ చేసిన ఆరోపణలకు, ఆ దేశ రాజకీయ వాక్చాతుర్యాన్ని ఏమైనా కారణాలున్నాయా? అనే అంశాలపై ఈటీవీ భారత్​ సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ... నేపాల్​లో పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త రంజిత్​ రే, బ్రూకింగ్స్ ఇండియా ఫెలో క్రిస్టియానో జేవియర్​తో చర్చించారు.

నేపాల్​-భారత్​ అంశంపై ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూ

"భారత్​-నేపాల్​ మధ్య దాదాపు 98 శాతం సరిహద్దు గొడవలు పరిష్కారం అయిపోయాయి. ఇంకా సద్దుమణగని భూభాగం కాలాపానీ. ఇదే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమవుతోంది. కాలాపానీలో చైనా తలదూర్చకుండా భారత్​ చూడాలి. గతంలోనూ భూటాన్​తో కలిసి ఇలానే డ్రాగన్​ దేశం ఇబ్బందులు సృష్టించింది. ఫలితంగా 73 రోజులు డోక్లాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి"

-- క్రిస్టియానో​ జేవియర్​

"నేపాల్‌లో తన ఆర్థిక ఉనికిని రాజకీయ అవసరాలకు మార్చుకునే ప్రయత్నాల్లో చైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్​ నేపాల్​తో రాజకీయ నేతలతో సత్సంబంధాలు మరింత మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపట్టాలి. ఇరుదేశాలు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి"

-- రంజిత్​ రే, భారత మాజీ దౌత్యవేత్త

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.