ETV Bharat / international

నేపాల్​ ఆర్మీకి లక్ష టీకాలు అందించిన భారత్​

నేపాల్​ సైన్యానికి లక్ష కొవిడ్​ టీకాలు బహుమతిగా ఇచ్చింది భారత్. శనివారం ఈ డోసులు కాఠ్మాండుకు చేరుకున్నట్లు ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు.

India gifts nepal army
నేపాల్​ ఆర్మీకి లక్ష కొవిడ్​ టీకాలు ఇచ్చిన భారత్
author img

By

Published : Mar 29, 2021, 10:53 AM IST

నేపాల్​తో​ స్నేహబంధానికి గుర్తుగా తన ఉదారతను చాటుకుంది భారత్​. నేపాల్​ సైన్యానికి లక్ష కొవిడ్​ టీకాలు బహుమతిగా ఇచ్చింది. సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను శనివారం ఎయిర్​ ఇండియా విమానం ద్వారా పంపించింది.

"వైరస్​పై పోరాటంలో భాగంగా భారత్​ పంపిన లక్ష కొవిడ్​ టీకాలు కాఠ్మాండుకు చేరుకున్నాయి. త్వరలో అవి సైన్యానికి అందిచనున్నాం" అని నేపాల్​ ఆర్మీ అధికార ప్రతినిధి సంతోష్ బల్లావ్ పౌదేల్ తెలిపారు.

కొవాక్స్​ చొరవతో ఇటీవలే భారత్​ 3,48,000 కొవిడ్​ టీకాలను నేపాల్​కు అందించింది.

ఇదీ చదవండి:మృత్యువును జయించిన 6 నెలల చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.