పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితిలోకి వెళ్లిన మానవహక్కులపై తక్షణమే దృష్టి సారించాలని 46వ మానవహక్కుల సమావేశంలో యూఎన్హెచ్ఆర్సీని భారత్ కోరింది. పాక్‌లోని మైనారిటీలపై.. ఆ దేశ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడింది. పాక్.. తన ప్రసంగాలు మానుకొని ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది ప్రజలపై దృష్టిసారించాలని యూఎన్హెచ్ఆర్సీలో భారత శాశ్వత సెక్రటరీ పవన్‌కుమార్ బాదే అన్నారు.
" పాక్‌లో దయనీయస్థితిలోకి వెళ్లిన మానవహక్కులపై వెంటనే ఈ సంఘం దృష్టిసారించాలి. అక్కడి మైనారిటీ వర్గాలపై వివక్ష చూపుతోంది పాక్. ప్రపంచదేశాల్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది."
-- పవన్‌కుమార్ బాదే, యూఎన్హెచ్ఆర్సీలో భారత శాశ్వత సెక్రటరీ
పాకిస్థాన్ తన వివాదస్పద మత చట్టాలతో మైనారిటీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని యూఎన్హెచ్ఆర్సీలో పవన్‌కుమార్ బాదే తెలిపారు. మత చట్టాల బాధితులు పెరిగిపోతున్నారని వివరించారు.
ఇదీ చదవండి : పాక్‌లో గుడి కూల్చేసిన వారికి హిందువుల క్షమాభిక్ష