ETV Bharat / international

తాలిబన్లకు చైనా భారీ సాయం- పాక్​తో కలిసి... - imran khan latest news

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు స్వేచ్ఛా వాణిజ్యం కీలకమని పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరువురు నేతలు ద్వైపాక్షిక ఆంశాలపై ఫోన్​లో చర్చించారు. అఫ్గాన్(Afghan News) ప్రజలు తీవ్ర నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశానికి తక్షణమే మానవతా, ఆర్థిక సాయం అందించాలని ఉమ్మడిగా అభ్యర్థించారు. మరోవైపు.. చైనా తమకు 10 లక్షల డాలర్ల విలువైన సాయం అందించిందని తాలిబన్ ప్రతినిధులు తెలిపారు.

china pak on afghan
అఫ్గాన్​పై చైనా, పాక్​
author img

By

Published : Oct 26, 2021, 6:51 PM IST

Updated : Oct 26, 2021, 10:30 PM IST

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పాకిస్థాన్‌, చైనా మరోసారి పేర్కొన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (రెండో దశ) ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాయి. తాజాగా ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు సహకారంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఫోన్‌లో సమీక్ష జరినట్లు ఇరు దేశాల అధికారిక కార్యాలయాలు వెల్లడించాయి.

చైనాపై ఇమ్రాన్ ప్రశంసలు..

కరోనా వైరస్‌ మహమ్మారిని చైనా ఎదుర్కొన్న తీరును ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సంభాషణ సందర్భంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసించారు. పాకిస్థాన్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్‌ అందించడంలో చైనా సహకారాన్ని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి చూపుతున్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో ఇరు దేశాలు ఆర్థిక, వాణిజ్య అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (China Pakistan Economic Corridor - CPEC)నుఅత్యంత నాణ్యతతో నిర్మించడంపై ఇమ్రాన్‌ ప్రశంసలు కురిపించినట్టు పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఆదుకోండి..

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) అధికారం చేపట్టినప్పటి నుంచి వారికి మద్దతుగా గళం వినిపిస్తున్న చైనా, పాకిస్థాన్(Pakistan Taliban Relations)​ మరో అడుగు ముందుకేశాయి. అఫ్గానిస్థాన్​కు(Afghan News) తక్షణమే మానవతా సాయం, ఆర్థిక సహకారం అందించాల్సిందిగా.. అంతర్జాతీయ సమాజాన్ని తొలిసారి ఉమ్మడిగా అభ్యర్థించాయి. శీతాకాలం కారణంగా అఫ్గానిస్థాన్​ ప్రజలు నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.

"అఫ్గాన్​లోని పరిస్థితులపై చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, పాక్​ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్​.. ఫోన్​లో చర్చించారు. అఫ్గాన్​ ప్రజల కష్టాలను తొలగించేందుకు, ఆ దేశ పునర్నిర్మాణం కోసం మానవతా సాయం, ఆర్థిక సహకారం అందించాల్సిందిగా... అంతర్జాతీయ సమాజానికి వారు విజ్ఞప్తి చేశారు."

-పాక్ ప్రధానమంత్రి కార్యాలయం

కతార్​లో ఉన్నత స్థాయి సమావేశం కోసం తాలిబన్ ప్రతినిధులతో(Afghanistan Taliban) చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమైన ఒకరోజు తర్వాత.. పాక్​, చైనా దేశాధినేతలు ఫోన్​లో మాట్లాడుకోవడం గమనార్హం.

చైనా సాయం చేసింది..

మరోవైపు... చైనా తమకు 10 లక్షల డాలర్ల విలువైన సాయం(China Humanitarian Aid) చేసిందని తాలిబన్(Afghanistan Taliban) ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. మరో 50 లక్షల డాలర్లను మానవతా సాయం కింద అందిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఔషధాలు, ఆహారం కింద ఈ సాయం అందించనుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

పాక్​ సరిహద్దు తెరవాలంటూ అఫ్గాన్​ పౌరుల ఆందోళన- రాళ్లదాడి!

Afgan taliban: అఫ్గాన్​లో మహిళల నిరసనలు హింసాత్మకం!

Last Updated : Oct 26, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.