ప్రపంచంపై కరోనా విలయం ఇంకా తగ్గలేదు. అనేక దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియాలో కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి శ్మశాన వాటికలు కిక్కిరిసిపోతున్నాయి. ఖాళీలు దొరకడం లేదు. బోగోర్లోని సిపెంజో శ్మశాన వాటికలో.. వైరస్‌తో మరణించిన తమ బంధువులను ఖననం చేసినందుకు.. సిబ్బందికి కృతజ్ఞతగా ఓ వ్యక్తి అభివాదం చేస్తున్న దృశ్యం ఇది.
బ్రెజిల్ ఇప్పటికీ కరోనాతో విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో పౌరులు అందరూ వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్లను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 35 ఏళ్లు పైబడిన వారికి టీకాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన క్రమంలో ఓ వ్యక్తి తన తొలి టీకాగా ఆస్ట్రాజెన్‌కాను తీసుకునేందుకు ముందుకు వచ్చిన దృశ్యమిది.
వెనిజువెలాలో ప్రతిఏటా జరుపుకునే నైట్రూట్ అనే కార్యక్రమంలో ఓ కళాకారిణి ఇచ్చిన ప్రదర్శన ఇది. కారకాస్ డౌన్టౌన్లో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ప్రజలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. కానీ చాలా మంది మాస్కులు ధరించలేదు.
వెనిజులాలోని నైట్రూట్ కార్యక్రమంలో ఓ కళాకారుడు ఇచ్చిన సాహస ప్రదర్శన ఇది.
జపాన్‌లోని టోక్యోలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు అదే నగరం ఒలింపిక్స్‌కు వేదికైంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ వీధుల్లో మాస్కులను ధరించి బయటకు వస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వియత్నాం రాజధాని హనోయ్‌లో 15 రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ట్రాఫిన్కు అదుపు చేయడానికి పోలీసులు బారికేడ్లను రోడ్లకు అడ్డుగా ఉంచారు. పౌరులు ఎవరూ బయటకు రాకుండా పోలీసులు కాపలాగా ఉన్న దృశ్యం ఇది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన 'వరల్డ్ వైడ్ ర్యాలీ ఫర్ ఫ్రీడం'తో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు అక్కడి ప్రజలు . పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరనలు తెలిపారు.
సిడ్నీలో నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ప్రజలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో ఉన్నవాటిని పోలీసులపై విసిరారు.
ప్రపంచ వ్యాప్తంగా 4,163,820 మంది ఇప్పటివరకు కరోనాతో చనిపోయారు.
ఇదీ చూడండి: సిద్ధిఖీ ఫొటోలు.. వేల భావాలు పలికే చిత్రాలు