ETV Bharat / international

భార్య ప్రియుడి ముక్కు, చెవులు కోసిన భర్త - పాకిస్థాన్​ న్యూస్​

తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ముక్కు, చెవులు కోసేశాడు ఓ భర్త. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పాక్​లోని పంజాబ్​ రాష్ట్రంలో జరిగింది.

Husband chops off nose, ears of wife's lover in Pakistan
భార్య ప్రియుడి ముక్కు, చెవులు కోసిన భర్త
author img

By

Published : Jul 23, 2021, 7:27 PM IST

Updated : Jul 23, 2021, 7:49 PM IST

అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాల్లో చిచ్చు పెడతాయి. ఒక్కోసారి.. మూడోవ్యక్తి ప్రవేశంతో పరువు హత్యలకు దారితీస్తాయి. ఇలాంటి సంఘటనే పాకిస్థాన్​ పంజాబ్​ రాష్ట్రంలో జరిగింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి చెవులు, ముక్కు కోశాడు ఓ భర్త. లాహోర్​కు 375 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్​గఢ్​ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..

అక్రమ్​ అనే వ్యక్తి ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఖయూమ్​ ఆగ్రహంతో రగిలిపోయాడు. గురువారం తన ఇంటికి వెళ్తున్న అక్రమ్​ను ఖయూమ్​, అతని స్నేహితులు అడ్డుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పదునైన కత్తితో.. ముక్కు, చెవులు కోసేశారు. తీవ్ర రక్తస్రావమైన అక్రమ్​ను అక్కడే వదిలేసి వెళ్లారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. అక్రమ్​ను నిస్తార్​ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఖయూమ్​ను అరెస్ట్​ చేశామని, మిగిలిన వారికోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.

ప్రతి ఏటా పాకిస్థాన్​లో 1000 మందికిపైగా మహిళలు, 600- 800 మంది పురుషులు పరువు హత్యలకు బలవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: వివాహిత ముక్కు కోసిన భగ్న ప్రేమికుడు

Last Updated : Jul 23, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.