నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్నీ లెక్కచేయకుండా గొడుగులు పట్టుకుని హాంగ్‌కాంగ్ పార్కులో ఆందోళన చేస్తున్నారు. పార్కు నిండిపోవడం వల్ల హాంగ్‌కాంగ్‌లోని ప్రధాన రోడ్డుపైనా తమ నిరసనలు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.
వర్షం పడుతున్నప్పటికీ నిరసనలు కొనసాగుతాయని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
ఆందోళనల కారణంగా హాంగ్‌కాంగ్ ఆర్థిక పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. నిరసనకారులకు అమెరికా ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారని చైనా ఆరోపించింది.
ఇదీ చూడండి:'పాక్‌తో చర్చలంటూ జరిగితే 'పీఓకే'పై మాత్రమే'