ETV Bharat / international

హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు - hongkong protests live updates

హాంకాంగ్​ ఆదివారం నిరసనలతో హోరెత్తింది. చైనా తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా వందలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

Hong Kong police fire volleys of tear gas at protesters
హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు
author img

By

Published : May 24, 2020, 1:46 PM IST

హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ నిరసనల జ్వాల చెలరేగింది. ఇటీవల చైనా ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. వందలాది మంది నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రతిపాదిత చట్టాన్ని నిరసిస్తూ.. షాపింగ్​కు ప్రఖ్యాతి గాంచిన కాస్​వే బే జిల్లాలో నిరసనకారులు నలుపు దుస్తులు ధరించి ప్రదర్శనలు చేపట్టారు. 'హాంకాంగ్​కు మద్దతివ్వండి', 'హాంకాంగ్​కు విముక్తి ప్రసాదించండి' అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు

బిల్లు అమల్లోకి వస్తే.. జరిగేదేంటీ?

నగరంలో వేర్పాటు వాద, విధ్వంసక కార్యకలాపాలను నిషేధించేందుకు చైనా ఇటీవలే చట్టసభ ముందుకు తీర్మానాన్ని తీసుకొచ్చింది. అయితే, హాంకాంగ్​ ప్రజాస్వామ్య అనుకూల మద్దతుదారులు బిల్లును వ్యతిరేకించారు. హాంకాంగ్​పై చైనా నియంతృత్వ చర్యలకు ఇది నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.

Hong Kong police fire volleys of tear gas at protesters
నిరసనలు చేపడుతున్న హాంకాంగ్​ వాసులు

మే 28న ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారందరినీ చైనా ఏకపక్ష ధోరణితో అరెస్టు చేస్తుందనే భయాలు హాంకాంగ్​ వాసుల్లో నెలకొన్నాయి.

బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు

పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు

ఇదీ చదవండి:చైనా బిల్లుతో హాంకాంగ్​ చట్టసభలో నిరసనల హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.