హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యానికి స్వస్తి పలకాలని కొన్ని నెలలుగా ప్రజాస్వామ్యవాదులు పోరాటం చేస్తున్న తరుణంలో ఆ దేశ చట్టసభ్యులు గురువారం వివాదాస్పద చైనా ఆంథెమ్ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో చైనా జాతీయ గీతాన్ని అవమానించటం నేరంగా పరిగణించనున్నారు.
హాంకాంగ్ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టిన క్రమంలో ప్రజాస్వామ్య అనుకూల ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సభ్యులు సభాపతి ఛాంబర్ ముందుకు వెళ్లి ఆందోళన వ్యక్తం చేయగా.. వారిని బలవంతంగా సభ నుంచి బయటికి పంపించేశారు. దాంతో బిల్లుపై చర్చను వాయిదా వేశారు. అనతరం కొద్ది సమయానికి చర్చ ప్రారంభించి నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం తెలిపారు. బిల్లుకు 41 మంది అనుకూలంగా ఓటు వేయగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. చాలా మంది ప్రజాస్వామ్య అనుకూల ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాక్ఔట్ చేశారు.
భిన్నవాదనలు..
జాతీయ గీతం బిల్లుపై విమర్శలు చేశారు ప్రజాస్వామ్య అనుకూలవాదులు. అది దేశ ప్రజల హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలింగిచటమేనని పేర్కొన్నారు. మరోవైపు.. హాంకాంగ్‌వాసులు చైనా జాతీయ గీతాన్ని గౌరవించేందుకు తప్పనిసరిగా ఈ చట్టం అవసరమని తెలిపారు బీజింగ్ అనుకూలవాదులు
ముడేళ్ల జైలు శిక్ష..
చైనా జాతీయ గీతం 'మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్'కు ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా అగౌరవ పరిచినట్లు తేలితే 3 ఏళ్ల జైలు శిక్ష, సుమారు 50వేల హాంకాంగ్ డాలర్లు (6,450 అమెరికా డాలర్లు) జరిమానా విధించనున్నారు.