ETV Bharat / international

చైనా కక్షసాధింపు- హాంకాంగ్​ మీడియా దిగ్గజం అరెస్ట్ - hongkong china latest news

హాంకాంగ్​పై పూర్తిస్థాయి ఆధిపత్యం, అసమ్మతి స్వరాల అణచివేతే లక్ష్యంగా చర్యలు ముమ్మరం చేసింది చైనా. చైనా వ్యతిరేకి అయిన హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లైను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై విదేశాలతో సంబంధాలు, మోసపూరిత కుట్ర వంటి అభియోగాలు నమోదు చేశారు.

Hong Kong
మీడియా దిగ్గజం జిమ్మీ అరెస్టు
author img

By

Published : Aug 10, 2020, 4:08 PM IST

హాంకాంగ్​లోని తమ వ్యతిరేక శక్తులను అణగదొక్కి, పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని అడ్డంపెట్టుకుని హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లైను అరెస్టు చేయించింది.

Hong Kong
మీడియా దిగ్గజం జిమ్మీ అరెస్టు

జిమ్మీకి చెందిన 'నెక్స్ట్ డిజిటల్ గ్రూప్​' సంస్థలో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించినట్లు ఆయన సహాయకుడు మార్క్ సైమన్​ వెల్లడించారు. ఆయనపై విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నట్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లై, ఆయన కుమారుడి ఇళ్లల్లోనూ సోదాలు చేశారని, సంస్థకు చెందిన పలువురు సభ్యులనూ నిర్బంధంలోకి తీసుకున్నారని స్పష్టం చేశారు.

కొత్త చట్టం ఉల్లంఘన కింద మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై విదేశాలతో సంబంధాలు, మోసపూరిత కుట్ర వంటి అభియోగాలు ఉన్నాయని తెలిపారు. అయితే వాళ్ల పేరు, ఇతర వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

Hong Kong
మీడియా దిగ్గజం జిమ్మీ అరెస్టు

ఇదే మొదటిసారి..

చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వార్తా సంస్థలపై ప్రయోగించి, మీడియా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ప్రయత్నించటం ఇదే తొలిసారి. ఈ చట్టంతో ఓ ప్రముఖ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవటమూ మొదటిసారే.

చైనాకు వ్యతిరేకం..

నెక్స్ట్ డిజిటల్ గ్రూప్​.. యాపిల్ డైలీ, ఫీస్టీ ప్రో డెమొక్రసీ టాబ్లాయిడ్​ నిర్వహిస్తుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వ చర్యలను ఈ పత్రికలు తీవ్రంగా ఖండిస్తాయి. గతేడాది జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనాలని ఈ పత్రికలు తమ పాఠకులను అర్థించాయి.

జిమ్మీ ప్రజాస్వామ్య వాది..

హాంకాంగ్​పై భద్రతా చట్టాన్ని చైనా ప్రకటించగానే జిమ్మీ తీవ్రంగా ఖండించారు. హాంకాంగ్​ను హస్తగతం చేసుకునేందుకు చైనా ఈ చట్టాన్ని ఉపయోగిస్తుందని న్యూయార్క్​ టైమ్స్​లో జిమ్మీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. ఆయన ట్వీట్లే ఉల్లంఘనలకు ఆధారాలని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్​ రాసింది.

గతేడాది జరిగిన ప్రజాస్వామ్య నిరసనల్లో పాల్గొన్నందుకు జిమ్మీని ఫిబ్రవరి, ఏప్రిల్​లో వరుసగా రెండు సార్లు అరెస్టు చేశారు. జూన్​ 4న 'తియానన్మెన్​ స్క్వేర్​ ఘటన'ను ప్రస్తావించినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి.

జిమ్మీకి మద్దతుగా..

జిమ్మీ అరెస్టు వార్తల నేపథ్యంలో నెక్స్ట్ డిజిటల్ గ్రూప్​ షేరు విలువ 200 శాతం పెరిగింది. షేర్లు కొనడం ద్వారా సంస్థకు మద్దతు తెలపాలని ఆన్​లైన్​లో విస్తృత ప్రచారం జరిగింది. జిమ్మీ అరెస్టును తైవాన్​ కూడా ఖండించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ రాజకీయ దురుద్దేశంతో ఈ చర్యలకు దిగిందని ఆరోపించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.