చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా 11 వారల క్రితం మొదలైన నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. వందల సంఖ్యలో నిరసనకారులు వెదురు కర్రలు, బేస్‌బాల్ బ్యాట్లతో పోలీసులపై దాడికి దిగారు. వారిని ప్రతిఘటించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఇరువురు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది.
రెండు వారాలుగా ప్రశాంతంగా సాగిన నిరసనలు మరోసారి హింసాత్మకంగా మారాయి.
దీపస్తంభాలు...
ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన దీపస్తంభాలను తొలగించాలని కొందరు నిరసనకారులు డిమాండ్ చేశారు. వాటిలో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారన్న అనుమానంతో కొంత మంది వాటిని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే వీటిని ట్రాఫిక్ సమాచారం సేకరించేందుకే ఏర్పాటు చేశామని ప్రభుత్వం పేర్కొంది.
డిమాండ్ల కోసం...
హాంకాంగ్‌లో పూర్తి ప్రజాస్వామ్యం కావాలని ఆందోళనకారులు నిరసనలు చేస్తున్నారు. నిరసనకారులపై పోలీసుల దాష్టీకాల పట్ల స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
ఇదీ చూడండి: లైవ్ ఫైట్: హాంకాంగ్ పోలీసులు X నిరసనకారులు