ETV Bharat / international

పాక్​లో మరో హిందూ దేవాలయం ధ్వంసం - పాకిస్థాన్​లోని హిందూ దేవాలయం ధ్వంసం

పాకిస్థాన్​ సింధ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఇస్మాయిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి మానసిక స్థితి సరిగ్గా ఉందా, లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Hindu Temple vandalised in Pakistan
పాక్​లో మరో హిందూ దేవాలయం ధ్వంసం
author img

By

Published : Oct 11, 2020, 5:58 PM IST

Updated : Oct 11, 2020, 9:00 PM IST

పాకిస్థాన్​ సింధ్ ​రాష్ట్రం బదిన్​ జిల్లాలో ఓ హిందూ దేవాలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. మహ్మద్​ ఇస్మాయిల్​ ఈ పని చేసి, పరారయ్యాడని అశోక్​ కుమార్​ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని గంటల్లోనే అనుమానితుడిని అరెస్ట్​ చేసినట్లు బదిన్ ​పోలీసులు తెలిపారు.

నిందితుడు ఇస్మాయిల్​ మానసికస్థితి స్థిరంగా ఉందా ? కావాలనే అతడు విగ్రహాలను ధ్వంసం చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఘటన జరిగిన 24 గంటల్లోనే దర్యాప్తు ప్రారంభించాం.

-బదిన్ జిల్లా ఎస్పీ షబీర్​ సెతార్​

ముస్లింల తర్వాత పాకిస్థాన్​లో హిందువులే అధికం. అధికార వర్గాల ప్రకారం దాదాపు 75 లక్షల మంది హిందువులు ఉన్నారు. సింధ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Last Updated : Oct 11, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.