ETV Bharat / international

'ప్రమాదం అంచున హాంగ్​కాంగ్'- వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు

హాంగ్​కాంగ్​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.  నిరసనలతో రవాణా వ్యవస్థ గందరగోళంగా మారింది. దేశం చాలా ప్రమాదకర పరిస్థితికి చేరుకుందని ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలు పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలకు దారితీశాయి.

'ప్రమాదం అంచున హాంగ్​కాంగ్'.. వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు
author img

By

Published : Aug 5, 2019, 9:17 PM IST

'ప్రమాదం అంచున హాంగ్​కాంగ్'

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంగ్​కాంగ్​ ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుందని ఓ నాయకుడు హెచ్చిరించిన నేపథ్యంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. వరుసగా మూడోరోజు పోలీసులు, ఆందోళనకారులు మధ్య ఘర్షణలు తలెత్తాయి.

సోమవారం వేల మంది వీధుల్లోకి చేరి నిరసనలు చేశారు. ఉదయాన్నే భూగర్భ రైల్వే స్టేషన్లకు చేరుకున్న ఆందోళనకారులు రైల్వే సేవలకు అంతరాయం కలిగించారు. మధ్యాహ్నం 7 ప్రధాన ప్రాంతాలు, పోలీసు స్టేషన్ల పరిసరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనకారులను చెదురగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు.

హాంగ్​కాంగ్​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన సుమారు 160 విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయ సిబ్బంది విధులను బహిష్కరించడమే కారణమని విమానాల అటెండెంట్ల​ యూనియన్​ పేర్కొంది.

జూన్​ 9 నుంచి ఇప్పటి వరకు 1000 రౌండ్ల బాష్పవాయువు, 160 రౌండ్ల రబ్బర్​ బులెట్లు ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. 420 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 139 మంది సిబ్బందికి గాయాలయ్యాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.