జపాన్ దేశాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. దక్షిణ జపాన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. డజను మందికిపైగా ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మరికొందరు భవనాలపై చిక్కుకొని, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కుమామొటో, కాగోషిమా ప్రాంతాలలో సుమారు 75 వేల మంది ఆవాసాలను కోల్పోయారు. అయితే వాస్తవానికి ఎంతమంది నగరాన్ని విడిచిపెట్టారనే విషయంపై స్పష్టతలేదు. నీటి ప్రవాహంలో అక్కడి కార్లు, చెట్లు నీట మునిగాయి. ఈ ఘటనలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయమై అంచనా వేస్తున్నారు అధికారులు.
ఈ ఘటనపై స్పందించిన ఆ దేశ ప్రధాని షింజో అబే.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
- ఇదీ చదవండి: కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!