నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'సై' సినిమా చూశారా. క్లైమాక్స్‌లో విలన్ బృందం విచిత్రమైన డ్యాన్స్‌తో కథానాయకుడికి సవాల్ విసురుతుంది. ఇది న్యూజిలాండ్ దేశపు మావోరి సంప్రదాయమైన హాకా నృత్యం. దీనిని రగ్బీ క్రీడలో ప్రత్యర్థుల ముందు నర్తిస్తారు . ఇటీవల జరిగిన క్రైస్ట్‌చర్చ్ మసీదు దాడిలో అమరులైన వారికి నివాళిగా కివీస్ ప్రజలు ఇదే నృత్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హాకా నృత్యాన్ని భావోద్వేగంతో ప్రదర్శించారు కివీస్‌లోని మావోరి బైకర్ గ్యాంగ్ సభ్యులు. వీరికి మద్దతుగా ఆస్ట్రేలియాలో నివసించే న్యూజిలాండ్ ప్రజలు కూడా ఈ హాకా నృత్యంతో తమ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Incredibly emotional display of the famous #NewZealand Haka performed to honor the victims of the #NewZealandMosqueAttack pic.twitter.com/v66ACLq7Fx
— Safwan Choudhry (@SafwanChoudhry) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Incredibly emotional display of the famous #NewZealand Haka performed to honor the victims of the #NewZealandMosqueAttack pic.twitter.com/v66ACLq7Fx
— Safwan Choudhry (@SafwanChoudhry) March 17, 2019Incredibly emotional display of the famous #NewZealand Haka performed to honor the victims of the #NewZealandMosqueAttack pic.twitter.com/v66ACLq7Fx
— Safwan Choudhry (@SafwanChoudhry) March 17, 2019
శుక్రవారం న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లో రెండు మసీదులపై కాల్పులకు పాల్పడ్డాడు ఆస్ట్రేలియాకి చెందిన బ్రెంటన్ టర్రంట్. ఈ దాడిలో 50 మంది మృతి చెందగా, ఎంతోమంది గాయపడ్డారు. ప్రశాంతమైన దేశంగా పేరు గాంచిన న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">