చైనాలోని హుబే రాష్ట్రంలో సెప్టెంబర్ 30న ఓ వివాహ వేడుక జరిగింది. అక్కడకు వెళ్లిన అతిథులు వధువును చూసి ఆశ్చర్యపోయారు. ఆ వధువు 60కేజీల బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం ఇందుకు కారణం!
ఆ నగలను వరుడు వధువుకు కానుకగా ఇచ్చాడు. 60 గోల్డ్ నెక్లెస్‌లు(ఒక్కోటి 1కేజీ ఉంటుంది), రెండు భారీ బంగారు గాజులు వధువుకు గిఫ్టుగా అందించాడు.
అంత భారీ ఆభరణాలు ధరించిన వధువులు అసలు నడవలేకపోయింది. అది గమనించిన వరుడు ఆమెకు సహాయం చేశాడు.
60కేజీల బంగారు ఆభరణాలు వేసుకున్న వధువు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు 'వావ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి:- కుక్కర్‌ను పెళ్లాడిన యువకుడు.. నాలుగు రోజులకే విడాకులు!