కరోనా తన విస్తృతిని పెంచుకుంటూపోతోంది. ప్రపంచదేశాల్లో ఇప్పటివరకు కోటీ 37 లక్షల 28 వేల మందికిపైగా కరోనా సోకింది. మరో 5.87 లక్షలకుపైగా వైరస్ ధాటికి బలయ్యారు. 81 లక్షల 78 వేల మంది ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు.
రోజూ 6 వేలకుపైనే..
రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజూ 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 6,428 మంది కొవిడ్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,52,797కు చేరింది. మరో 167 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 11,937కు చేరింది.
ఆ దేశంలో 37 వేల మంది మృతి..
మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇవాళ మరో 6,149 కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 3 లక్షల 17 వేలు దాటాయి. దాదాపు 37 వేల మంది మృతి చెందారు.
⦁ ఇరాన్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. తాజా 2,500 కేసులు.. 198 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 2,67,061 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
⦁ పాకిస్థాన్‌లో గురువారం 2,145 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 2,57,914కు, మరణాలు 5,426కు చేరాయి.
⦁ సింగపూర్‌లో తాజాగా 248 మందికి వైరస్ సోకింది. వీరిలో 237 కేసులు విదేశీ కార్మికులే. మొత్తం కేసులు 47,126కు చేరాయి. ఇప్పటివరకు 27 మంది చనిపోయారు.
⦁ నేపాల్‌లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. 167 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 39 మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు.
⦁ బంగ్లాదేశ్‌లో తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు 1,96,323 మంది బాధితులు ఉన్నట్లు ఆ దేశ ఆధికారులు తెలిపారు. ఫలితంగా 2,496 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 36,18,739 | 1,40,172 |
బ్రెజిల్ | 19,72,072 | 75,568 |
రష్యా | 7,52,797 | 11,937 |
పెరూ | 3,37,724 | 12,417 |
చిలీ | 3,21,205 | 7,186 |
మెక్సికో | 3,17,635 | 36,906 |
దక్షిణాఫ్రికా | 3,11,049 | 4,453 |
స్పెయిన్ | 3,04,574 | 28,413 |