ETV Bharat / international

కరోనా పిడికిలిలో కోటి మంది బాధితులు..? - కరోనా తాజా వార్త

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ.. కోటికి చేరువైంది. గడచిన 24 గంటల్లో రష్యాలో దాదాపు 7 వేల కేసులు నమోదయ్యాయి. మెక్సికోలో 5 వేలు, పాకిస్థాన్​లో 3 వేల మంది వైరస్​ బారినపడ్డారు. సౌదీ అరేబియా, బంగ్లాదేశ్​ సహా ఇతర ఆసియా దేశాల్లోనూ కొవిడ్​ వేగంగా విజృంభిస్తోంది.

Global COVID-19 tracker
కరోనా పిడికిలిలో కోటి మంది బాధితులు..?
author img

By

Published : Jun 27, 2020, 9:14 PM IST

ప్రతిరోజూ లక్షల మందిని బాధితులుగా మార్చుకుంటోన్న కరోనా... వందల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటోంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 99 లక్షల 50 వేల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దాదాపు 5 లక్షల మంది మృతిచెందారు. మరో 54 లక్షల మంది కోలుకున్నారు.

Global COVID-19 tracker
కరోనా వివరాలు

రష్యాలో కొత్తగా 6,852 కేసులు..

రష్యాలో కరోనా అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తోంది. దేశవ్యాప్తంగా మరో 6,852 మంది వైరస్​ బాధితులుగా మారారు. ఇప్పటివరకు 6,27,646 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188 మంది మహమ్మారి సోకి మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9 వేలకు చేరువైంది.

పాక్​లో 73 మంది మృతి

పాకిస్థాన్​లో కరోనా కేసులు, మరణాలు అధికమవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 3,138 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 1,98,883 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 73 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,035కు చేరింది.

12 వేలకు పైగా..

నేపాల్​లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో 554 మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది. ఇప్పటివరకు 12 వేల 309 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో కరోనాతో 28 మంది మరణించారు.

  • సింగపూర్​లో గడచిన 24 గంటల్లో 291 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 286 మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
  • చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా మరో 21 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
  • మెక్సికోలో కొత్తగా 5 వేల 441 మంది బాధితులను గుర్తించారు. మరో 719 మంది మృతి చెందారు.
  • సౌదీ అరేబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం లక్షా 78 వేల 504 మందికి కరోనా సోకింది.
  • బంగ్లాదేశ్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. తాజాగా 3,504 మంది కరోనా బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 34 వేలకు చేరింది.
  • దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 24 వేలకు చేరినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి:'ఆ 8 రాష్ట్రాల్లోనే 85 శాతం కరోనా కేసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.