ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా- స్పెయిన్​లో తగ్గుముఖం

కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన స్పెయిన్​లో మార్చి 20 తర్వాత తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 517 మంది మృతి చెందారు. కొత్తగా 3,477 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,15,000 మందికిపైగా మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువైంది.

Global COVID-19 tracker
స్పెయిన్​లో కరోనా తగ్గుముఖం
author img

By

Published : Apr 13, 2020, 5:45 PM IST

స్పెయిన్​లో కరోనా తీవ్రత క్రమేనా తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్య గత వారం రోజులుగా తక్కువగా ఉండగా.. ఇప్పడు కొత్త కేసుల సంఖ్య మూడు వారాల కనిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో 517 మంది మృతి చెందారు. 3,477 కొత్త కేసులు నమోదయ్యాయి. మార్చి 20 తర్వాత ఇదే అత్యల్పం. కరోనా కారణంగా ఇప్పటివరకు స్పెయిన్​లో 17,489 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్​లో ఆదివారం 111 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్తగా 1,617 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 73,303కు చేరగా.. మరణాల సంఖ్య 4,585కు పెరిగింది.

పాకిస్థాన్​లో పెరుగుదల...

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. కొత్తగా నమోదైన 334 కేసులతో కలిపి మొత్తం సంఖ్య 5,374కు చేరింది. ఇప్పటి వరకు 93 మంది మృతి చెందారు. 44 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య లక్షా 15వేలకు పెరిగింది.

కరోనా కేసుల వివరాలు..

Global COVID-19 tracker
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల వివరాలు

ఇదీ చూడండి:లాక్​డౌన్​ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.