ఆసియా, ఐరోపా దేశాల్లో కరోనా కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 68 లక్షల 35 వేలు దాటింది. మరో 10 లక్షల 68 వేల 101మంది మృత్యువాత పడ్డారు. రష్యా, బ్రెజిల్, భారత్, సహా పలు దేశాల్లో కొవిడ్ వేగంగా విస్తరిస్తోంది.
- రష్యాలో కరోనా కేసులు రోజూ 10 వేలకుపైనే నమోదవుతున్నాయి. తాజాగా 12,126 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 201మంది మృతి చెందారు.
- మెక్సికోలో మరో 370మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5300మందికి కరోనా సోకింది.
- ఇరాన్లో ఒక్కరోజే 4142మంది వైరస్ బారినపడ్డారు. మరో 210మంది చనిపోయారు.
- ఇరాక్‌లో శుక్రవారం 3214కేసులు.. 53 మరణాలు నమోదయ్యాయి.
- ఇండోనేసియాలో 4094 కొత్త కేసుల్ని గుర్తించారు. మరో 97మంది మృత్యువాత పడ్డారు.
- ఉక్రెయిన్‌లో 5804, నెదర్లాండ్స్‌లో 5971 కేసులు బయటపడ్డాయి.
- బెల్జియంలో ఇవాళ 5728 మందికి వైరస్ సోకింది.
ఇదీ చూడండి: కరోనా రోగుల్లో 3 నెలల పాటు యాంటీబాడీలు!