ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 6 కోట్ల 88 లక్షల 45 వేలు దాటింది. కరోనా ధాటికి ఇప్పటివరకు 15 లక్షల 68 వేల మందికిపైగా మరణించారు.
- రష్యాలో కొవిడ్ కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 26,190 మందికి కరోనా సోకింది. మరో 559 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో ఒక్కరోజే 16,578 కేసులు నమోదవగా.. 533 మంది చనిపోయారు.
- ఇటలీలో తాజాగా 12,756 మంది వైరస్ బారిన పడ్డారు. 499 మృతి చెందారు.
- పోలండ్‌లో కొత్తగా 12 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 568 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మెక్సికోలో తాజాగా 800 మందిని కరోనా బలి తీసుకుంది. కొత్తగా 11 వేల మంది వైరస్ బారిన పడ్డారు.
- ఉక్రెయిన్‌లో ఒక్కరోజే 12,585 మందికి వైరస్ సోకగా.. 276 మంది చనిపోయారు.
- ఇరాన్లో కొత్తగా 10 వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూడగా.. మరో 295 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: ఫైజర్ టీకాతో అలర్జీ- ప్రజలకు బ్రిటన్ హెచ్చరిక