చైనా షెన్యాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు (Explosion in China) సంభవించింది. ప్రమాదంలో (China news) నలుగురు మృతి చెందగా, 47 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు.
![CHINA EXPLOSION restaurant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13420470_vlcsnap-2021-10-21-19h42m59s870-1.jpg)
దీన్ని గ్యాస్ పేలుడుగా (China Gas explosion 2021) అధికారులు గుర్తించారు. పేలుడు (Explosion in restaurant) ప్రభావంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వసం అయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది 25 అగ్నిమాపక యంత్రాలు, 110 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు.
![CHINA EXPLOSION restaurant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13420470_vlcsnap-2021-10-21-19h42m59s870-2.jpg)
పేలుడు (China Gas explosion today) తీవ్రతకు స్థానికులు బెంబేలెత్తిపోయారు. బాంబు దాడి (China Gas explosion) జరిగిందేమోనని భయపడ్డారు. ఘటన సమయంలో పక్క నుంచి వెళ్తున్న ఓ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇతర వాహనాలు సైతం దెబ్బతిన్నాయి.
గ్యాస్ పైప్లైన్ పనులు.. ఆ తర్వాత పేలుడు
పేలుడుకు ముందు ఈ ప్రాంతంలో గ్యాస్ పైప్లైన్ నిర్మాణ పనులు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఈ పనులు చేపట్టినట్లు గ్యాస్ కంపెనీ వెల్లడించింది. పేలుడు అనంతరం దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు తమ సిబ్బందిని పంపించింది.
ఇదీ చదవండి: 'దురాక్రమణ ఆపని చైనా.. అడ్డుకట్ట వేయాల్సిందే'