పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో ఓ వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలి.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
ఇదీ జరిగింది
రావల్పిండి నుంచి గుజరావాలాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన మినీ ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ వెనుక భాగంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో వ్యాన్‌లోని ప్రయాణికులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా పేర్కొంది.
ఇదీ చూడండి: షికాగోలో కాల్పుల కలకలం-పోలీసు ఆఫీసర్ మృతి