ETV Bharat / international

'హాంకాంగ్​ విషయంలో చైనా పునరాలోచించుకోవాలి'

హాంకాంగ్​పై జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలన్న చైనా నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి జీ-7 సభ్య దేశాలు. ఈ నిర్ణయంపై చైనా పునరాలోచించుకోవాలంటూ అన్ని దేశాలు సంయుక్తంగా ప్రకటనను విడుదల చేశాయి.

G-7 calls on China to reconsider Hong Kong security law
'హాంకాంగ్​ విషయంలో చైనా పునరాలోచించుకోవాలి'
author img

By

Published : Jun 18, 2020, 11:45 AM IST

హాంకాంగ్‌ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంటు ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని జీ-7 సభ్యదేశాలు సూచించాయి. ఈ మేరకు అన్ని దేశాలు కలిపి ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి.

''హాంకాంగ్​పై జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలని చూస్తున్న చైనా నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిర్ణయంతో నిబంధనలకు వ్యతిరేకంగా బీజింగ్​ అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నట్లు అవుతుంది.''

-జీ-7 దేశాల సంయుక్త ప్రకటన

ఈ నిర్ణయం వల్ల హాంకాంగ్ వృద్ధి​ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాయి సభ్య దేశాలు. బహిరంగ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు ఆ దేశాల విదేశాంగ మంత్రులు. హాంకాంగ్ వాసుల హక్కులు, స్వేచ్ఛను గౌరవించాలని తెలిపారు.

ఈ బిల్లుపై వివాదం ఎందుకు?

బిల్లులోని నిబంధనల ప్రకారం హాంకాంగ్‌పై చైనా ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలు వస్తాయి. చైనా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా, దేశం నుంచి విడిపోతామని నినదించినా, విదేశీ జోక్యాన్ని ప్రోత్సహించినా నేరంగా పరిగణిస్తారు. ఆందోళనకారులపై 'ఉగ్రవాద' ముద్ర వేసేందుకు వీలవుతుంది. చైనా భద్రతా దళాలు ఈ నగరంలో ప్రవేశించి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

చైనా స్పందన..

హాంకాంగ్​లో జాతీయ భద్రతా చట్టంపై జీ-7 దేశాల ప్రకటనను చైనా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి:భారత్​- చైనా మధ్య సైనిక చర్చలు మళ్లీ జరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.