మాల్దీవుల ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్ నేతృత్వంలోని ఎండీపీ ఘనవిజయం సాధించింది. పలు అభియోగాలతో విదేశాల్లో ఉండి... దేశానికి తిరిగి వచ్చిన 5 నెలల్లోనే తిరిగి జాతీయ పార్లమెంట్లోకి నాటకీయంగా తిరిగొచ్చారు. 87 మంది ఉన్న అసెంబ్లీలో నషీద్ నేతృత్వంలోని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ) 60 సీట్లు దక్కించుకుంది.
మాల్దీవుల్లో పోలింగ్ శనివారం జరిగింది.
నషీద్కు వచ్చిన అఖండ మెజార్టీతో ఆయన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామిన్కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆయన నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ 4 సీట్లు మాత్రమే దక్కించుకుంది.
మాల్దీవులకు తమ పార్టీ స్థిరమైన పాలనను తీసుకువస్తుందని నషీద్ తెలిపారు. దేశంలో సంస్కరణలు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందిస్తానని పేర్కొన్నారు.