ETV Bharat / international

అక్కడ పార్కులు రీఓపెన్- ముందస్తు బుకింగ్ తప్పనిసరి!

author img

By

Published : May 1, 2020, 4:01 PM IST

కరోనాతో తీవ్ర ప్రభావితమైన చైనాలో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. బీజింగ్​లోని పర్యటక ప్రదేశమైన ఫర్​బిడెన్ సిటీ సహా పార్కులు, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతిస్తున్నారు. అయితే ముందస్తు బుకింగ్​ చేసుకుని పర్యటక ప్రాంతాల్లోకి వెళ్లవచ్చని సూచిస్తున్నారు.

china
అక్కడ పార్కులు పునః ప్రారంభం.. ముందస్తు బుకింగ్ తప్పనిసరి!

చైనాలో కరోనా ముప్పు తగ్గిన నేపథ్యంలో రాజధాని నగరంలోని చారిత్రక ఫర్​బిడెన్ సిటీ సహా పార్కులు, మ్యూజియం వంటి పర్యటక స్థలాలు తెరుచుకున్నాయి. నాడు చైనా చక్రవర్తుల నివాసమైన ఫర్​బిడెన్ సిటీలోకి రోజుకు 5,000మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తికి ముందు ఒకే రోజులో 80,000 మంది ఈ పర్యటక స్థలాన్ని వీక్షించేవారు.

పార్కులకు ముందస్తు బుకింగ్..

పార్కుల్లోకి కూడా ప్రజలను అనుమతిస్తున్నారు చైనా అధికారులు. అయితే జన సంచారాన్ని నియంత్రించేందుకు సాధారణ రోజుల్లో వచ్చేవారి సంఖ్యలో 30 శాతం మందికి మాత్రమే పార్కుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని అనుకునే వారు ఆన్​లైన్​లో ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మే 22న జాతీయ చట్టసభ సమావేశం..

మే 22న చైనా చట్టసభ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం కానుంది. మార్చి తొలివారంలోనే సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ వైరస్ విజృంభణ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారా.. లేక సభ్యులు హాజరవుతారా అనే అంశమై స్పష్టత కొరవడింది.

ఇదీ చూడండి: క్వారంటైన్​లో కూలీల శ్రమదానం- బడికి కొత్తరూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.