ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడిన థాయిలాండ్ నెమ్మదిగా కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద(Thailand floods) పలు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ ఇంకా అనేక లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తాగడానికి నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద నీటినే ఇంటి అవసరాలకు వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోనే గడుపుతున్నారు.
వరదల వల్ల ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. థాయిలాండ్‌లోని 32 ప్రావిన్సుల్లో మొత్తం 2.71 లక్షలకుపైగా ఇళ్లు నీట మునిగాయని.. అయితే 14 ప్రావిన్సుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు చారిత్రక నగరమైన ఆయుతాయలోని పలు దేవాలయాలు, కట్టడాలు వరద నీటిలోనే ఉన్నాయి.
ఇదీ చూడండి: వరదల్లో పారాగ్లైడర్ల సాహసం- ఆహారపొట్లాలతో ఎగురుకుంటూ వెళ్లి...