ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్నిపర్వతం బద్ధలైంది. రాజధాని మనీలా సహా దగ్గర్లోని చాలా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. స్థానికులను అప్రమత్తం చేసిన గంట వ్యవదిలోనే.. అగ్నిపర్వతం విస్ఫోటం చెందింది.
అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిద.. గాల్లో 50 వేల అడుగుల ఎత్తుకు ఎగిసింది. ఈ కారణంగా రాజధానిలోని నీనోయ్ ఆక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని విమాన రాకపోకలను నిలిపివేశారు అధికారులు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద సమీప పట్టణాల్లోని ఇళ్లు, రోడ్లపై పడుతోంది.
దక్షిణ మనీలాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాల్ అగ్నిపర్వతం నుంచి వెలువడ మాగ్మా.. బిలం వైపు కదులుతున్నట్లు ప్రభుత్వ సిస్మాలజిస్టులు గుర్తించారు. తాల్ అగ్నిపర్వతం చివరగా 1977లో బద్ధలైంది. గతంలో 2018 జనవరిలోనూ మౌంట్ మయాన్ అగ్నిపర్వతం బద్ధలై లావా, అగ్నిపర్వత శిలలు సెంట్రల్ బైకోల్లోకి చేరిన కారణంగా దాదాపు 10 వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
ఇదీ చూడండి:ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరిక