ETV Bharat / international

జనాలపైకి దూసుకెళ్లిన కారు- ఐదుగురు మృతి - china crimes

చైనాలో రోడ్డు దాటుతున్న ప్రజలపైకి ఓ కారు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో మత్స్యకారుల పడవ నీట మునిగి నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.

accident
ప్రమాదం
author img

By

Published : May 23, 2021, 10:53 AM IST

చైనా లియానింగ్​ ప్రావిన్సులో ఓ కారు డ్రైవర్​ బీభత్సం సృష్టించాడు. జనాలపైకి తన కారుతో దూసుకువచ్చాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగింది?

దాలియన్​ నగరంలో రోడ్డు దాటుతున్న ప్రజలను శనివారం అర్ధరాత్రి సమయంలో.. సెడాన్​ కారు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారని ప్రభుత్వ వార్తాసంస్థ 'జిన్హువా' కథనం తెలిపింది. క్షతగాత్రులైన మరో ఐదుగురు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పింది.

ఈ కేసులో కారు డ్రైవర్​ లియుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో అతడు.. మత్తుపదార్థాలను సేవించలేదని చెప్పారు. కావాలనే ప్రజలకు హాని తలపెట్టే విధంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చైనాలో ఇటీవలి సంవత్సరాల్లో పౌరులపై ఆకస్మిక దాడులు జరగటం సర్వసాధారణంగా మారింది.

నలుగురు మృతి- ఐదుగురు గల్లంతు..

మత్స్యకారుల పడవ నీట మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన.. చైనాలోని హీలాంగ్జియాంగ్​ ప్రావిన్సులో జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు క్విక్విహార్​ నగరంలో ఓ నదిలో ఈ ప్రమాదం జరిగింది. బోటులో మొత్తం 11 మంది ఉన్నారని 'జిన్హువా' వార్తా సంస్థ తెలిపింది.

ఇద్దరు వ్యక్తులను రక్షించగా.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఇదీ చూడండి: రోడ్లపై లావా ప్రవాహం- భయంతో జనం పరుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.