చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దక్షిణ చైనా ప్రాంతంలోని గుయిజౌ రాష్ట్రం జుని నగరంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది ఆచూకీ గల్లంతైంది.
ఈ ప్రాంతంలో నుంచి సుమారు 13,000 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించినట్లు అధికారులు తెలిపారు. 2 వేలకుపైగా ఇళ్లు, పలు ప్రాంతాల్లో రోడ్లు, మూడు వంతెనలు పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల్లో 13 మంది
కొద్ది రోజుల క్రితం తుపానుల బీభత్సంతో హునాన్, గ్వాంగ్జీ రాష్ట్రాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా వర్షాకాలంలో నదీ పరివాహక ప్రాంతాలైన యాంగ్జీ, పెర్ల్లో వరదల ప్రభావం అధికంగా ఉంటుంది.
500 మిలియన్ డాలర్ల నష్టం!
ఇటీవలి వరదల కారణంగా 500 మిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక నష్టం జరిగినట్లు అంచనా వేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: చైనాలో వరదలు.. భారీగా ఆస్తి నష్టం!