ETV Bharat / international

టవర్​పై కిమ్ నిరసన.. శాంసంగ్​ 'సారీ'తో విరమణ

author img

By

Published : May 29, 2020, 10:11 PM IST

దక్షిణ కొరియాలో ఏడాది కాలం నుంచి 82 అడుగుల ఎత్తున్న టవర్​పై నిరసన చేపట్టాడు శాంసంగ్ సంస్థ మాజీ ఉద్యోగి. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని దీక్షకు దిగాడు. సంస్థ క్షమాపణలు చెప్పిన తర్వాత నిరసన విరమించాడు.

Fired Samsung worker ends tower protest following apology
ఏడాదిగా టవర్​పై కిమ్ నిరసన.. శాంసంగ్​ 'సారీ'తో విరమణ

ప్రముఖ ఎలక్ట్రానిక్​ దిగ్గజ సంస్థ శాంసంగ్​ తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందని నిరసిస్తూ ఏడాది కాలంగా 82 అడుగుల ఎత్తున్న టవర్​పై నివాసముంటున్నాడు ఓ వ్యక్తి. దక్షిణ కొరియా రాజధాని సియోల్​లోని ట్రాఫిక్ కెమెరా టవర్​పై శాంసంగ్​ బ్యానర్ ప్రదర్శిస్తూ దీక్ష చేస్తున్నాడు.

ఎట్టకేలకు 354 రోజుల తర్వాత శాంసంగ్ సంస్థ క్షమాపణలు చెప్పాక నిరసన ముగించాడు. అగ్నిమాపక సిబ్బంది అతడ్ని టవర్​పై నుంచి కిందకు దించారు.

సియోల్​లోని శాంసంగ్ కార్యాలయం సమీపంలోని టవర్​పై నిరసన చేసిన వ్యక్తి పేరు కిమ్​ యోంగ్​ హీ(60). ఆ సంస్థలో ఆయన మాజీ ఉద్యోగి. 1995లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలతో కిమ్​ను ఉద్యోగం నుంచి తొలగించింది శాంసంగ్​.

బిలియనీర్​, శాంసంగ్ వారసుడు లీ జే యోంగ్ ప్రస్తుతం అవినీతి ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. సంస్థలో యూనియన్ ఏర్పాటు ప్రయత్నాలు భగ్నం చేసే విధానాలకు స్వస్తి పలుకుతామని గతవారమే ప్రకటించారు.

కిమ్​కు కలిగిన నష్టాన్ని, బాధను తగ్గించడానికి తాము మరింత కృషి చేసి ఉండాల్సిందని క్షమాపణలు తెలిపింది శాంసంగ్. అయితే కార్మిక సంఘం ఏర్పాటుకు ప్రయత్నించినందుకే కిమ్​ను ఉద్యోగం నుంచి తొలగించారా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

శాంసంగ్ క్షమాపణలు చెప్పడాన్ని కిమ్​కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు.

శాంసంగ్​కు, కిమ్​కు మధ్య ఏం చర్చ జరిగింది? అతనికి సంస్థ పరిహారాన్ని చెల్లించిందా? లేక ఉద్యోగంలోకి తిరిగి తీసుకుందా? అనే విషయంపై ఇరువురి నుంచి ఏలాంటి స్పష్టత లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.