జపాన్లోని దక్షిణ ద్వీపం ఓకినావాలోని చారిత్రక షురి కోటలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కోట.. ప్రమాదం కారణంగా తీవ్రంగా దెబ్బతింది.
మంటలను అరికట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ముందు జాగ్రత్తగా పరిసరాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో కోటలోని ప్రధాన సీడెన్ ఆలయంతో పాటు ఉత్తర, దక్షిణ ఆలయాలు ధ్వంసమయ్యాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కోట చరిత్ర ఇదే..
సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటను యూక్యువాన్ రాజు కాలం నాటికి చెందినదిగా చరిత్రలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో... దాడి జరిగి ధ్వంసం అయ్యింది. ఆ తర్వాత 1992లో పునరుద్ధరించి.. జాతీయ పార్కుగా మార్చారు. 2000 సంవత్సరంలో ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది యునెస్కో.
ఇదీ చూడండి: 90 నిమిషాల 'ఆపరేషన్ బాగ్దాదీ' సాగిందిలా..!