ETV Bharat / international

ఖైదీల మధ్య ఘర్షణ- 18 మంది మృతి - కారాగారంలో అల్లర్లు

రెండు జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు తలెత్తి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఈక్వెడార్​లో జరిగింది.

Fighting among prison gangs
జైళ్లలో ఘర్షణ
author img

By

Published : Jul 22, 2021, 10:53 PM IST

ఈక్వెడార్​లోని రెండు జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు.

గౌయాక్విల్​ నగరంలోని ప్రధాన కారాగారం, సెంట్రల్​ ఈక్వెడార్​లోని లటకుంగా జైలులో బుధవారం ఈ అల్లర్లు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 9 మంది పోలీసులు, 35 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.

లటకుంగా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు ట్విట్టర్​ ద్వారా తెలిపారు. అయితే.. జైలులోని 45 మంది ఖైదీలను తప్పించుకోకుండా బంధించినట్లు చెప్పారు.

గత జూన్​ నెలలో ఈక్వెడార్​లోని ఓ జైలులో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, 11 మంది గాయపడ్డారు. అంకు ముందు ఫిబ్రవరిలో అల్లర్లు చెలరేగి 80 మంది ఖైదీలు మృతి చెందారు.

ఇదీ చూడండి: లైవ్​లో రిపోర్టర్​ను తుపాకీతో బెదిరించి చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.